వాళ్లు మోసం చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన నటి స్నేహ… ఎవరంటే?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో కుటుంబ చిత్రాలలో నటించి ఎంతోమంది తెలుగు ప్రేక్షకులను సంపాదించుకున్న నటి స్నేహ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె నటుడు ప్రసన్నను వివాహం చేసుకుని తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించిన స్నేహ తాజాగా చెన్నైలోని కానాతూర్ పోలీస్ స్టేషన్లో ఇద్దరు వ్యాపారవేత్తల పై ఫిర్యాదు చేసింది.

Sneha 2 | Telugu Rajyamఎక్స్ పోర్ట్ కంపెనీ నిర్వహిస్తున్న ఈ వ్యాపారవేత్తల దగ్గర స్నేహ చాలాకాలం నుంచి డబ్బు ఇన్వెస్ట్ చేస్తోంది. అయితే ఆమె చెల్లించిన డబ్బులు ఇప్పటివరకు ఏ విధమైనటువంటి రిటర్న్స్ ఇవ్వకుండా తనని మోసం చేశారంటూ నటి ఆరోపించారు. ఇప్పటి వరకు వారికి 26 లక్షల రూపాయలు ఇవ్వగా ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని వారిపై కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ విధంగా తనకు డబ్బులు చెల్లించకపోవడమే కాకుండా కేవలం వడ్డీ అయినా చెల్లించమని వారిని అడిగినప్పుడు అందుకు వారు తనను బెదిరిస్తున్నారని వెంటనే వారిపై చర్యలు తీసుకుని తన డబ్బును తనకు తిరిగి ఇచ్చేలా చూడాలని స్నేహ పోలీసులకీ ఫిర్యాదు చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే ఈమె పలు చిత్రాలలో అక్క పాత్రలో నటిస్తోంది. ఇక తన భర్తతో కలిసి ఎన్నో బ్రాండ్ లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్నారు.

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles