సెకండ్ ఇన్నింగ్స్ వర్కవుట్ అవుతుందా.. రాశీ డిమాండ్ పెరిగేనా?

Actress Raasi in New serial Janaki Kalaganaledu

వెండితెరపై వెలిగిన ఒకప్పటి తారలు ఇప్పుడు కొత్త ఇన్నింగ్స్‌ను మొదలుపెడుతున్నారు. సినిమాల్లో అవకాశాలు రాక ఖాళీగా ఉన్న సీనియర్ హీరో, హీరోయిన్లు ఎక్కువగా బుల్లితెరపై మొగ్గు చూపుతుంటారు. ఈ క్రమంలో చాలా మందే హీరోయిన్లు, హీరోలు కూడా బుల్లితెర ధారావాహికల్లో కనిపించారు. సురేష్, నాగబాబు, రాధిక, మీనా, రమ్యకృష్ణ వంటివారెంతో మందికి బుల్లితెర మళ్లీ ప్రాణం పోసింది. ఇప్పటికీ కొందరికీ బుల్లితెర ఇంకా స్టార్డంను ఇస్తూనే ఉంది. ఈ క్రమంలో సీనియర్ హీరోయిన్ రాశీ బుల్లితెరపై తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు వస్తోంది.

Actress Raasi in New serial Janaki Kalaganaledu
Actress Raasi in New serial Janaki Kalaganaledu

బుల్లితెరపై కొందరు సీరియల్స్ చేస్తుంటే ఇంకొందరు మాత్రం స్పెషల్ షోలతో బిజీగా ఉంటున్నారు. రోజా, మీనా, సంగీత, ప్రియమణి వంటి వారు వినోద కార్యక్రమాలు చేస్తున్నారు. తాజాగా రాశీ కూడా ఇదే బాట పట్టింది. మామూలుగా రాశీకి ఇప్పుడు డిమాండ్ లేదు. హీరోయిన్‌గా చాన్సులు తగ్గిన సమయంలో విలన్ రోల్, ఐటెం సాంగ్స్‌లో నటించింది. కానీ ఇప్పుడు రాశీకి ఎటువంటి ఆఫర్లు రావడం లేదు. అందుకే ఈ రూట్ఎంచుకున్నట్టు కనిపిస్తోంది.

స్టార్ మా చానెల్‌లో త్వరలో ఓ కొత్త సీరియల్ ప్రారంభం కాబోతోంది. జానకీ కలగనలేదు.. అంటూ రాబోతోన్న ఈ సీరియల్‌లో రాశీ మెయిన్ లీడ్ చేస్తోంది. సిరిసిరిమువ్వలు ఫేమ్ అమర్ దీప్ హీరోగా రాబోతోన్న ఈ సీరియల్‌లో రాశీ అతని తల్లి పాత్రలో కనిపించబోతోంది. అయితే ఇప్పటికే వదిలిన ప్రోమో బాగానే ఆకట్టుకుంటోంది. ఇక ఈ సీరియల్ ఎంతలా క్లిక్ అవుతుందో చూడాలి. రాశీ బుల్లితెర ప్రయాణం ఎలా కొనసాగుతుందో వేచి చూడాలి.