అలా వచ్చింది ఇలా వెళ్లింది.. మధ్యలో రాశీ ఖన్నా రచ్చ!

Raashi Khanna off to kochi

రాశీ ఖన్నా ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో అందరికీ తెలిసిందే. అయితే ఎంత బిజీగా ఉన్నా కూడా తన ఫ్యామిలీకి కావాల్సినంత సమయం కేటాయిస్తుందన్న విషయం కూడా తెలిసిందే. లాక్డౌన్ మొత్తం ఇంట్లోనే ఉన్న రాశీ ఖన్నా తల్లిదండ్రులతో కలిసి రచ్చ చేసింది. కొత్త కొత్త వంటకాలు, ఇతరత్రా పనులను కూడా నేర్చుకుంది. భాష, సంగీతంపై రాశీ ఖన్నా నాలెడ్జ్ పెంచుకుంది. అయితే అన్ లాక్ ప్రక్రియ మొదలవ్వడంతోనే రాశీ ఖన్నా మళ్లీ బిజీగా మారింది.

Raashi Khanna off to kochi

ఒకే సారి ప్రాజెక్ట్‌లన్నీ కూడా పట్టాలెక్కడంతో రాశీ ఖన్నాకు ఊపిరి తీసుకునేంతగా గ్యాప్ లేకుండా పోయింది. కోలీవుడ్‌లో వరుసగా రెండు ప్రాజెక్ట్‌లు ఒకేసారి సెట్స్ మీదకు వచ్చాయి. అలా చకచకా షూటింగ్‌లు పూర్తి చేయాల్సి రావడంతో వీకెండ్, పండుగలనే తేడా లేకుండా.. పగలు రాత్రి అని చూడకుండా పని చేసేసింది. అలాంటి సమయంలోనూ రాశీ ఖన్నా ఫ్యామిలీకి సమయం ఇచ్చింది. తన బర్త్ డే కోసం రాశీ ఖన్నా హైద్రాబాద్‌లో వాలింది. తల్లిదండ్రులు ఇచ్చిన సర్ ప్రైజ్ చూసి మురిసిపోయింది. చెల్లి పెళ్లిలో సందడి చేసింది.

అలా ఇప్పుడు మళ్లీ రాశీ ఖన్నా బిజీగా అయిపోయింది. ఫ్యామిలీమెన్ డైరెక్టర్స్ తీస్తోన్న మరో వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా నటిస్తోంది. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆల్రెడీ గోవాలో ప్రారంభమైంది. ఇన్ని రోజులు అక్కడే ఉన్న రాశీ.. రెండ్రోజుల క్రితమే హైద్రాబాద్‌లో వాలింది. అయితే తన తల్లిదండ్రులతో ఫాంహౌస్, పచ్చని ప్రకృతి అంటూ రెండు రోజులు హాయిగా ఎంజాయ్ చేసింది. మళ్లీ ఇప్పుడు తిరిగి కొచ్చికి వెళ్లిపోయింది. మొత్తానికి రాశీ ఖన్నా మాత్రం తన ప్లానింగ్‌తో రచ్చ రచ్చ చేస్తోంది.