టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతిని చూస్తే నిజంగానే జాలేస్తోంది. నాలుగు పదుల వయసులోనూ ఎంతో కఠినమైన వ్యాయామాలు చేస్తోంది. ఎందరో మహిళకు స్ఫూర్తిగా నిలుస్తోంది. ఎంతో కష్టాన్ని ఓర్చుకుంటోంది. కఠిన తరమైన కసరత్తులను చేస్తూ ఒళ్లు హూనం చేసుకోవడం చూస్తుంటే ఎవ్వరికైనా జాలి కలుగక మానదు. అసలు కరోనా, లాక్ డౌన్ కన్నా ముందు ప్రగతికి ఉన్న క్రేజ్, ఫేమ్, నేమ్ అన్నీ వేరు.
కరోనా టైంలో వైరస్ కంటే ఎక్కువగా ఫేమస్ అయింది. నిత్యం ఏదో ఒక వీడియో చేస్తూ సోషల్ మీడియాను ఊపేసింది. అంత వరకూ ఓ మోడ్రన్ మదర్, అత్త పాత్రల్లో ఊహించుకున్న ప్రగతికి, సోషల్ మీడియాలో అలా చూసిన ప్రగతికి ఎంతో తేడా ఉంది. స్లీవ్ లెస్ డ్రెస్సులు, నైట్ వేర్స్, లుంగీ కట్టుకోవడం ఇలా వామ్మో ఒకటా రెండా ప్రగతి మాస్ స్టెప్పులకు, ఊపులకు అందరూ అవాక్కయ్యారు.
సరే డ్యాన్సులతో సరిపెడతారని అనుకుంటే.. పాతికేళ్ల అమ్మాయిలా జిమ్‌లో దుమ్ములేపుతోంది. యంగ్ హీరోయిన్‌లకు పోటీ ఇచ్చేలా ఫిజిక్‌ను మార్చేసుకుంటోంది. మల్లెతీగలా మారాలాని చూస్తుందో ఏమో గానీ జిమ్‌లో మాత్రం తెగ కష్టపడుతోంది. ఆమె చేసే వ్యాయామాలు చూస్తే ఎవ్వరైన్ వావ్ అనాల్సిందే. ఆమె చేసే కష్టానికి ప్రతిఫలం వస్తుందేమో చూడాలి. ఏదైనా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో మంచి ఆఫర్ కొట్టేస్తుందేమో మరి.