టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉండే హీరోయిన్లలో అనుష్క ఒకరనే సంగతి తెలిసిందే. చిన్న వయస్సులోనే హీరోలకు, హీరోయిన్లకు తల్లిగా నటించిన ఈ నటి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించారు. యంగ్ మదర్ రోల్స్ ప్రగతికి ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టాయనే సంగతి తెలిసిందే. తాజాగా విడుదలైన ఎఫ్3 సినిమాతో ప్రగతి ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.
ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రగతి మాట్లాడుతూ టీవీలో సీరియళ్లతో బిజీగా ఉన్న సమయంలో ఆర్తి అగర్వాల్ కు తల్లిగా పని చేసే అవకాశం దక్కిందని తల్లి పాత్ర అని చెప్పగానే తనకు ఆ పాత్రలో నటించాలో వద్దో అర్థం కాలేదని ఆమె అన్నారు. ఆ సమయంలో మరో నటి శ్రీవిద్య క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను కొనసాగించాలని అనుకుంటే మాత్రం తల్లి పాత్రలు చేస్తే మంచిదని చెప్పారని ప్రగతి అన్నారు.
తాను యంగ్ హీరోలకు తల్లిగా నటించగా ఆ సినిమాలు సక్సెస్ సాధించాయని ప్రగతి తెలిపారు. తనను చాలామంది లక్కీ అమ్మ అని భావిస్తారని అయితే యంగ్ తేజ్ లోనే తాను తల్లిగా నటిస్తుండటంతో వాళ్లు బాధ పడిన సందర్భాలు కూడా ఉన్నాయని ప్రగతి కామెంట్లు చేశారు. ఢమరుకం సినిమాలో తాను హీరోయిన్ కు తల్లిగా నటించానని ఆ సమయంలో తాను తల్లి పాత్రలో నటిస్తున్నానని తెలిసి అనుష్క చాలా బాధపడ్డారని ప్రగతి చెప్పుకొచ్చారు.
తాను చాలా యంగ్ గా ఉన్నానని తాను తల్లి పాత్రలలో నటించడం ఏమిటని అనుష్క నాతో అన్నారని ప్రగతి కామెంట్లు చేశారు. ఇలియానా, రెజీనా కెసాండ్రా, అనుష్కలతో తనకు మంచి రిలేషన్లు ఉన్నాయని ఆమె చెప్పుకొచ్చారు. రామ్ చరణ్, బన్నీ, మరి కొందరు హీరోలకు ప్రగతి తల్లిగా నటించారు. నువ్వులేక నేనులేను, చిరుత, దూకుడు, ఏమైంది ఈవేళ సినిమాలు నటిగా ప్రగతికి మంచి పేరు తెచ్చిపెట్టాయి.