టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌ల్లో ప్రగతి రూటే సపరేట్. మోడ్రన్ మదర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంది. స్టార్ హీరోలకు అమ్మగా, అత్తగా పర్ఫెక్ట్ చాయిస్‌గా ఉంటుంది. ఇక కుర్ర హీరోయిన్లకు పోటీ ఇచ్చే అందం తన సొంతం. తెరపై అమ్మ పాత్రలు వేసినా.. కుర్ర హీరోయిన్లతో మాత్రం ఫ్రెండ్‌లానే మూవ్ అవుతుందట. ఇలియానా, రెజీనా ఇలా చాలా మంది రోజూ ఫోన్ ద్వారా టచ్‌లో ఉంటారట.
మరీ ముఖ్యంగా ఇలియానా మాత్రం క్లోజ్ ఫ్రెండ్ అట. రోజులో కనీసం ఒక్కసారైనా మాట్లాడుకుంటారట. అందుకే ప్రగతి కూడా హీరోయిన్లకు ధీటుగా నిలబడాలని, వారికి పోటీ ఇవ్వాలని కసరత్తులు చేస్తోన్నట్టు తెలుస్తోంది. స్టార్ హీరోయిన్లు ఫిట్‌నెస్ కోసం ఎంతగా కష్టపడతారో అంతకు పదింతలు ప్రగతి చెమటోడ్చుతోంది. జిమ్‌లో ఆమె పడే ప్రయాసలు చూస్తుంటే జాలి వేయక మానదు.
ఈ లాక్ డౌన్ కాలంలో ప్రగతి సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. లుంగి కట్టుకుని డ్యాన్సులు వేయడం, మాస్ స్టెప్పులే కాకుండా.. క్లాసికల్ డ్యాన్స్ కూడా చేసి అందర్నీ మెప్పింది. ఓ వైపు డ్యాన్సులు, మరో వైపు వర్కౌట్లు చేస్తూ ప్రగతి ఫుల్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. ఈ వయసులోనూ ఇంతలా కష్టపడుతుండంతో ఎంతో మంది ఆమెను చూసి స్ఫూర్తి పొందుతున్నారు. తాజాగా ప్రగతి 80 కేజీల బరువును ఎత్తేందుకు ప్రయత్నించింది. చూస్తుంటే కరణం మల్లీశ్వరి రేంజ్‌కి ఎదగాలని చూస్తున్నట్టు కనిపిస్తోంది.