‘ఆంఖ్ మారే’ అంటూ వయ్యారాలను తిప్పింది.. ప్రగతి డ్యాన్స్ మామూలుగా లేదు!!

టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ ప్రగతి సోషల్ మీడియా సెన్సేషన్ అన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కన్నుగీటి, ముద్దు గన్నులను పేల్చిన ప్రియా వారియన్ నేషనల్ వైడ్‌గా ఎంత ఫేమస్ అయిందో.. తన డ్యాన్సులు, వర్కౌట్లతో రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రగతి అంతగా వైరల్ అయింది. లాక్ డౌన్ పుణ్యమా అని ప్రగతి క్రేజ్ వంద రెట్లు పెరిగింది. సినిమాలు లేకపోయినా, అందరూ ఇంట్లోనూ కూర్చున్నా గానీ ప్రగతి మాత్రం స్టార్ హీరోయిన్ లెవెల్‌లో రచ్చ చేసింది.

Actress Pragathi Dance Video For Aankh Mare Song
Actress Pragathi Dance Video For Aankh Mare Song

లుంగీ కట్టి డ్యాన్సులు చేయడం, కొడుకుతో పోటీగా, కొడుకు కంటే ఫుల్ జోష్‌లో అదరగొట్టే స్టెప్పులతో దుమ్ములేపింది ప్రగతి. ఆపై కజరారే అంటూ తన ఒంపుసొంపులను తిప్పుతూ నెటిజన్లకు మత్తెక్కించింది. ఇక ప్రగతి డ్యాన్సులకు ఫిదా అయిన వారంతా నోరెళ్ల బెట్టారు. ప్రగతిలో ఇంత టాలెంట్ ఉందా.. తెరపై మనం చూసే ప్రగతి.. ఇలా ఇప్పుడు రచ్చ చేస్తోన్న ప్రగతి ఒక్కరేనా? అని ఆశ్చర్యపోతున్నారు.

ఇక కేవలం డ్యాన్సులతోనే కాదు వర్కవుట్లలోనూ ప్రగతి అందర్నీ షాక్‌కు గురి చేస్తోంది. ఆటల పోటీల్లో పాల్గొనేందుకు ఎంతలా కష్టపడతారో అంతలా చెమటోడ్చుతోంది. తాజాగా ప్రగతి మరో వీడియోను వదిలింది. రణ్‌వీర్ సింగ్ హీరోగా వచ్చిన సింబా సినిమాలోని ఆంఖ్ మారే అనే పాటకు అదిరిపోయే స్టెప్పులు వేసింది. ఆ తిప్పడం, ఆ మెలికలు తిరగడం చూసి అందరూ షాక్ అవుతున్నారు. మళ్లీ హీరోయిన్‌గా ప్రగతి ఎంట్రీ ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.