నితిన్ పక్కన హీరోయిన్‌లానే ఉంది.. ప్రగతి రచ్చ మామూలుగా లేదుగా!

లాక్‌డౌన్ కాలంలో నటి ప్రగతి చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. సోషల్ మీడియాలో విపరీతమైన పాపులార్టీని తెచ్చుకుంది. వెండితెరపై మోడ్రన్ మదర్‌గా కనిపించే ప్రగతి.. ఒక్కసారిగా సోషల్ మీడియాలో తన విశ్వరూపాన్నిచూపెట్టింది. లుంగి కట్టి మాస్ స్టెప్పులు వేసి అందర్నీ షాక్‌కు గురి చేసింది. ఆపై డ్యాన్సులు, వర్కౌట్ల వీడియోలను వదులుతూ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారింది. ఈ మధ్య కాలంలో టాలీవుడ్ ఆర్టిస్ట్‌ల్లో ప్రగతి చేసినంత హల్చల్ మరో నటి చేయలేదు.

Actress Pragathi And Nithiin Shoot For An Ad
Actress Pragathi And Nithiin Shoot For An Ad

అయితే ఆమె ఇన్ని నెలలు పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినట్టు కనిపిస్తోంది. నిత్యం వర్కౌట్లు చేస్తూ యంగ్ హీరోయిన్లకు పోటీ ఇచ్చేలా తయారైంది. మునుపటి కంటే ఎంతో అందంగా తయారైన ప్రగతికి అదిరిపోయే ఆఫర్ వచ్చింది. తాజాగా ప్రగతి ఓ యాడ్ షూటింగ్‌లో పాల్గొంది. ఈ మేరకు ప్రగతి షేర్ చేసిన ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది.

Actress Pragathi And Nithiin Shoot For An Ad
Actress Pragathi And Nithiin Shoot For An Ad

హీరో రామ్ కూడా ఈ మధ్యే యాడ్స్ రంగంలోకి దిగాడు. జుట్టుకు రంగు వేసే షాంపు కోసం ప్రకటనలో నటించాడు. ప్రస్తుతం నితిన్ కూడా ఓ యాడ్ కోసం మేకప్ వేసుకున్నాడు. ఈ యాడ్‌లో నితిన్‌తో పాటు ప్రగతి కూడా నటిస్తోంది. ప్రస్తుతం వీరిద్దరిపై షూట్ జరుగుతోంది. ఆ వీడియోనే ప్రగతి షేర్ చేసింది. దీంట్లో ప్రగతి హీరోయిన్‌లా ఉందని, నితిన్ పక్కన హీరోయిన్‌లా కనిపిస్తోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.