Poorna: ఒక్క సినిమా అవకాశం ఇవ్వండి అంటూ వేదికపై అభ్యర్థించిన నటి పూర్ణ..!

Poorna:టాలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమాల ద్వారా హీరోయిన్ గా పరిచయమై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న పూర్ణ అనంతరం బుల్లితెరపై ప్రసారమయ్యే కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా వ్యవహరించారు.ఈ విధంగా వెండితెరపై బుల్లితెరపై ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం హీరోయిన్ గా కాకుండా సపోర్టింగ్ పాత్రల ద్వారా ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఈ విధంగా సపోర్టింగ్ పాత్రలలో నటిస్తూ మంచి గుర్తింపు పొందిన ఈమె అఖండ సినిమా ద్వారా మంచి విజయాన్ని అందుకుంది.

ఈ క్రమంలోనే తాజాగా పూర్ణ నటించిన విచిత్రన్‌ సినిమా ఆడియో విడుదల అయ్యింది. ఈ కార్యక్రమంలో భాగంగా నటి పూర్ణ వేదికపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.తనకు ఎప్పటినుంచో దర్శకుడు బాలా దర్శకత్వంలో ఒక సినిమాలో అయినా నటించాలనే కోరిక ఉందని అయితే ఇప్పటివరకు తన కోరిక నెరవేర లేదని తనకు తన సినిమాలో నటించే అవకాశం కల్పించాలని వేదికపై దర్శకుడు బాలాను వేడుకున్నారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటివరకు ఈయన దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయలేదు కానీ ఆయన నిర్మాణంలో తెరకెక్కిన సినిమాలలో నటించానని తెలిపారు.

ఈ విధంగా దర్శకుడు బాల సినిమాలో అవకాశం కోసం ఎంతో ఎదురు చూస్తున్న పూర్ణకు ఆయన సినిమాల్లో నటించే అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే ఈమె ప్రస్తుతం కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉండడమే కాకుండా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు.ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా ఈమె తన గ్లామరస్ ఫోటోలను షేర్ చేస్తూ ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నారని చెప్పవచ్చు.