ఈ వయసులో రెండో పెళ్లికి సిద్ధమైన నటి మీనా… వైరల్ అవుతున్న న్యూస్?

బాలనటిగా సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా వరుస సినిమాలలో అగ్ర హీరోలు అందరి సరసన నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీనా గురించి అందరికీ సుపరిచితమే.ఈమె తెలుగు తమిళ భాషలలో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. ఇలా ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న సమయంలోనే మీనా విద్యాసాగర్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. ఇలా వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్న మీనా దంపతులకు ఒక కుమార్తె కూడా జన్మించారు. ఈ చిన్నారిని కూడా బాలనటిగా మీనా ఇండస్ట్రీకి పరిచయం చేశారు.

ఇకపోతే జీవితంలో ఎంతో సంతోషంగా కొనసాగుతున్నటువంటి ఈమె తిరిగి తన సెకండ్ ఇన్నింగ్స్ కూడా ప్రారంభించారు. ఇలా తన సెకండ్ ఇన్నింగ్స్ వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి మీనా జీవితంలో ఊహించని విషాదం చోటుచేసుకుంది. తన భర్త విద్యాసాగర్ అనారోగ్య సమస్యలతో బాధపడుతూ మరణించడంతో ఈమె ఒంటరిగా మారిపోయారు.ఇలా తన భర్త మరణం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న మీనా గురించి తాజాగా మరో వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఇప్పుడిప్పుడే తన భర్త జ్ఞాపకాల నుంచి బయటపడిన మీనాకు మరో పెళ్లి చేయాలనే తన కుటుంబ సభ్యులు భావించారట. దీంతో తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మరో పెళ్లి చేసుకోమని తన కుటుంబ సభ్యులు తనపై ఒత్తిడి తీసుకువస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇక రెండో పెళ్లి చేసుకోవడానికి మీనా ఇష్టపడకపోయినా తన కూతురు భవిష్యత్తు కోసం ఈమె కూడా రెండో పెళ్లి గురించి ఆలోచనలో పడినట్లు కోలీవుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. కేవలం తన కూతురు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈమె తన స్నేహితుడిని రెండో పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైనదని సమాచారం. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజము ఉందో తెలియాల్సి ఉంది.