ప్రస్తుతం దేశంలో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కేసు ఎంతటి సెన్సేషన్‌కు దారి తీస్తోందో అందరికీ తెలిసిందే. మొదటగా నెపోటిజం కారణంగానే ఆత్మహత్య చేసుకున్నాడని టాక్ వచ్చింది.. ఆపై ప్రేయసి రియా చక్రవర్తి వల్లె ఆత్మహత్య చేసుకున్నాడని వినిపించింది. అది అసలు ఆత్మహత్య కాదు.. హత్య అంటూ, ఇందులో డ్రగ్స్ మాఫియా హస్తం కూడా ఉందని తాజాగా వినిపిస్తున్న టాక్. ఈ మేరకు రియా చక్రవర్తికి డ్రగ్స్ మాఫియాతో లింకులు ఉన్నట్టు నార్కోటిక్ బ్యూరో కేసులు నమోదు చేసింది. బాలీవుడ్‌లో డ్రగ్స్ గుట్టు లాగేందుకు ఎన్‌సీబీ రంగంలోకి దిగింది. ఈ విషయంపై మాధవీలత స్పందించింది.
‘సుశాంత్ సింగ్ కేసు లో అడుగు పెట్టడం మంచిదే . బాలీవుడ్ లో డ్రగ్స్ వాడకం బాగా ఉంది అన్నది నిజం. కానీ ఇదిగో అదిగో అని ఫైనల్ గ తుస్సుమనిపిస్తారేమో నాకు డౌట్ ఎందుకంటే అంత బడా బాబులే కదా , అందులోను సినిమా రంగం ఇప్పటికే చెడ్డ పేరు అంటగట్టుకుంది . కానీ డ్రగ్స్ నేరం . ఒక పేదవాడికి అన్నం పెడతారో లేదో డ్రగ్స్ కి 1ప్యాకెట్ అంటారా గ్రాములు అంటారా? ఎదో దానికి వేలు పెడతారు సరే అది వాళ్ళ ఇష్టం . ఇండియా లో పర్మిషన్ ఉన్నవి తినండి తాగండి. దేశానికి ఆదాయం పెంచుకుంటే పెంచుకోండి కానీ ఇతర దేశాల మారక ద్యవ్యాలు ఎందుకు .ఆ మత్తులో జరిగే అరాచకాలు ఎవరు బయట పెట్టరు.
అది సరే కానీ , తెలంగాణ NCBసార్లు మన టాలీవుడ్ మీద కూడా ఒక కన్నేయండి పీతకన్నూ కాకుండా సీరియస్ కన్ను వేయండి . మన ఇండస్ట్రీ లో బాగా వాడుకలో ఉంది . అది లేకుండా కొన్ని పార్టీ లు జరగవు ఇక్కడ . 2009 లో వచ్చారు పొలిటికల్ అండ తో వెనక్కి పోయారు పాపం డీల్ చేసిన ఆఫీసర్ నోరు నొక్కేసి Other Department కి పడేసారు . చట్టానికి చేతులు చాల పెద్దవి అందుకే అవి చాచితే విరగొడతారు . చాల దారుణాలు జరుగుతున్నాయి మత్తులో 1. సినిమా వాళ్ళు , 2.పబ్స్, 3. స్టూడెంట్స్ . బాగా వాడుతూ మాదక ద్యవ్యాల వారికీ బాగా ఆదాయాన్ని పెంచుతున్నారు . కాస్త చూసి అదుపులో పెట్టండి …. ఆమ్మో నాకు భయం గా ఉంది ఈ పోస్ట్ పెట్టాను అని నన్ను ఎవరైనా బెదిరిస్తారేమో అని ఎవరు డ్రగ్స్ జోలికి పోరు ఆ అధికారులు కూడా చూసి చూడనట్లే ఉంటారు నిజం గ పట్టుకుంటే వాళ్ళకి భయం . ఒకవేళ పట్టుకున్న ప్రభుత్వాలు ఎలాగూ వదిలేయి అని బయపెడతాయి కదా ఆఫీసర్స్ ని. సరేలే నాకేమన్నా అయితే చట్టం చేతకానితనం అని నేనే కేసు పెట్టాల్సి వస్తది ఏమో ….’ అంటూ తన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసింది.