థైస్ అందాలతో బలగం భామ స్టన్నింగ్

టాలీవుడ్ లోకి ఈ మధ్యకాలంలో కొత్త కొత్త అందాలు పరిచయం అవుతున్నాయి. తెలుగు అమ్మాయిలు కూడా తమ అందం, నటనతో సినిమాలలో అవకాశాలు సొంతం చేసుకుంటే హీరోయిన్స్ గా సక్సెస్ అయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన తెలుగు అందం కావ్య కళ్యాణ్ రామ్.

గంగోత్రి సినిమాలో చైల్డ్ యాక్టర్ గా నటించిన ఈ చిన్నది మసూద మూవీతో గత ఏడాది హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా సూపర్ హట్ అయ్యింది. ఈ ఏడాది బలగం సినిమాతో మరో హిట్ ని తన ఖాతాలో కావ్య కళ్యాణ్ రామ్ వేసుకున్నారు. దిల్ రాజు బ్యానర్ లో కమెడియన్ వేణు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకి అంతర్జాతీయ స్థాయిలో అవార్డులు కూడా అందుకుంటుంది.

ఈ మూవీలో తన న్యాచురల్ పెర్ఫార్మన్స్ తో నటిగా కావ్య కళ్యాణ్ రామ్ మంచి మార్కులు కొట్టేసారు. నటనకు స్కోప్ ఉన్న పాత్రలో కావ్య మెప్పించారు. ప్రస్తుతం శ్రీ సింహ హీరోగా తెరకెక్కిన ఉస్తాద్ మూవీలో కావ్య కళ్యాణ్ రామ్ హీరోయిన్ గా నటిస్తున్నారు. ఆమెకి ఇది హీరోయిన్ గా మూడవ చిత్రం. సోషల్ మీడియాలో కూడా ఈ అందాల భామ చాలా యాక్టివ్ గా ఉండటం విశేషం.

రెగ్యులర్ గా తనకు సంబంధించిన అప్డేట్స్ ను షేర్ చేసుకుంటూ ఫాలోవర్స్ ని పెంచుకుంటున్నారు. ఇంస్టాగ్రామ్ లో కావ్య కళ్యాణ్ రామ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కేవలం పెర్ఫార్మన్స్ మాత్రమే కాకుండా గ్లామర్ కూడా అవసరం. ఈ విషయాన్ని ఈ అందాల భామ గ్రహించిందని చెప్పాలి.

ఈ నేపథ్యంలో ఇప్పుడిప్పుడే కాస్త గ్లామర్ గా ఫ్యాషన్ కాస్ట్యూమ్స్ లో కనిపించే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పింక్ కలర్ స్కర్ట్ లో థైస్ అందాలు చూపిస్తూ టెంప్ట్ చేసే లుక్ తో కావ్య కళ్యాణ్ రామ్ మెరిసిపోతూ ఉండడం విశేషం