13 మంది అతిథుల సమక్షంలో నా పెళ్లి జరిగింది.. ప్రేమ పెళ్లి గురించి ఇంద్రజ ఓపెన్ కామెంట్స్?

సినిమా ఇండస్ట్రీలో నటిగా ఎన్నో సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు నటి ఇంద్రజ. ఈమె తెలుగుతో పోలిస్తే తమిళం, హిందీ, మలయాళ భాషలలో ఎక్కువ సినిమాలలో నటించారు. ఇక తెలుగులో కూడా ఈమె నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయాలను అందుకున్నాయి. ఇకపోతే ప్రస్తుతం ఈమె సినిమా ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఈమె బుల్లితెర కార్యక్రమాలకు న్యాయం నిర్ణయతగా వ్యవహరిస్తూ పెద్ద ఎత్తున బుల్లితెర ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.ఇకపోతే ఒక కార్యక్రమంలో భాగంగా ఇంద్రజ తన ప్రేమ పెళ్లి గురించి అసలు విషయాలు బయట పెట్టారు.

ఇంద్రజ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించినప్పటికీ ఈమె ముస్లిం వ్యక్తిని ప్రేమించి ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈమె 2006లో నటుడు, బిజినెస్‌మెన్‌ మహమ్మద్‌ అబ్సర్‌ను పెళ్లాడింది. ఇక వీరికి ప్రస్తుతం సారా అనే ఒక కుమార్తె ఉంది. ఈ విధంగా తన భర్తను ప్రేమించి పెళ్లి చేసుకున్న సమయంలో కేవలం తన పెళ్లిలో 13 మంది మాత్రమే అతిథులు హాజరయ్యారని ఇంద్రజ పేర్కొన్నారు. ఇకపోతే అప్పట్లో తన పెళ్లికి అక్షరాల 7500 రూపాయలు ఖర్చు అయిందని ఈ సందర్భంగా ఇంద్రజ తన పెళ్లి గురించి అన్ని విషయాలు బయట పెట్టారు.

ఇలా ప్రేమించిన వ్యక్తిని ఇంట్లో వాళ్ళు ఒప్పుకోకపోవడంతో తాను కొందరి స్నేహితుల సమక్షంలో పెళ్లి చేసుకున్నట్లు పేర్కొన్నారు.ఇకపోతే ఇంద్రజ ప్రస్తుతం బల్లితెరపై ప్రసారమవుతున్న జబర్దస్త్ కార్యక్రమానికి న్యాయ నిర్ణయితగా వ్యవహరించడమే కాకుండా పలు స్పెషల్ కార్యక్రమాలలో కూడా పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇకపోతే ఇంద్రజ స్టాండప్ రాహుల్ అనే సినిమాలో హీరో తల్లి పాత్రలో నటించిన సందడి చేశారు. ఈ విధంగా ఈమె మరికొన్ని సినిమాలలో కూడా తల్లి పాత్రలలో నటిస్తూ బిజీగా ఉన్నారు. మొత్తానికి నటి ఇంద్రజ తన ప్రేమ పెళ్లి గురించి చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.