Indraja: పుష్ప 2 లో అవకాశం దక్కించుకున్న నటి ఇంద్రజ… హాట్ టాపిక్ గా మారిన ఇంద్రజ!

Indraja: క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన సినిమా పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ నెలలో విడుదల అయి బాక్సాఫీసు వద్ద మంచి విజయాన్ని అందుకుంది.ఇకపోతే త్వరలోనే ఈ సినిమా సీక్వెల్ చిత్రం పుష్ప 2 చిత్రీకరణ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే స్క్రిప్ట్ పనులను పూర్తి చేసిన సుకుమార్ త్వరలోనే షూటింగ్ ప్రారంభించబోతున్నారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సమాచారం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

పుష్ప1 లో ఉన్న నటీనటులే పుష్ప 2 లో కూడా సందడి చేయనున్నట్లు మనకు తెలిసిందే. కానీ కథలో కొన్ని కీలక మార్పులు చేయడం వల్ల మరి కొంతమంది నటీనటుల అవసరం పడటంతో సుకుమార్ సీనియర్ నటి ఇంద్రజ సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే ఈమె పుష్ప 2 సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎంతో మంది సీనియర్ నటీమణులు రీఎంట్రీ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.

ఈ క్రమంలోనే నటి ఇంద్రజ కూడా రీ ఎంట్రీ తర్వాత బుల్లితెరపై పలు కార్యక్రమాలలో చేయడమే కాకుండా.. రాజ్ తరుణ్ హీరోగా నటిస్తున్న స్టాండప్ రాహుల్ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇక ఈ సినిమా ఈ నెల 18వ తేదీ విడుదల కానుంది. ఈక్రమంలోనే ఈమె పుష్ప2లో నటించే అవకాశం దక్కించుకున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమెకు త్వరలోనే మరిన్ని అవకాశాలు వస్తాయని పలువురు భావిస్తున్నారు. మరి ఈ విషయంలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే చిత్రబృందం అధికారక ప్రకటన చేయాల్సి ఉంది.