Anchor Suma: యాంకర్ సుమని పరుగులు పెట్టించిన హేమ.. వీడియో వైరల్!

Anchor Suma: యాంకర్ సుమ టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న లేడీ యాంకర్లలో ఒకరు. ఈమె గత కొన్ని సంవత్సరాలుగా తన యాంకరింగ్ తో ఎంతో మందిని అభిమానులుగా మార్చుకుంది.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న టాప్ మోస్ట్ యాంకర్లలో సుమ మొదటి స్థానంలో ఉందని చెప్పడంలో సందేహం లేదు. ఈవిడ ఎన్నో టీవీ షోలకు, ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లకు యాంకరింగ్ చేస్తూ నిత్యం బిజీగా ఉంటుంది. ప్రస్తుతం సుమ జయమ్మ పంచాయితీ అనే సినిమాలో నటిస్తోంది.

ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా సుమ ఈటీవీలో ప్రసారమవుతున్న క్యాష్ పోగ్రామ్ కు యాంకర్ గా వ్యవహరిస్తున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. ఈ షోలో ఎంతోమంది సెలబ్రిలు పాటిస్పేట్ చేస్తూ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నారు. ఈవారం ప్రసారం కాబోతున్న ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమో ఒకటి విడుదల చేశారు. ఈ వారం క్యాష్ ప్రోగ్రాంకి కృష్ణభగవాన్, హేమ, పోసాని కృష్ణమురళి, సమీర్ గెస్టులు గా హాజరయ్యారు. ఈ వారం ఎపిసోడ్ లో ఈ నలుగురు చేసే సందడి మామూలుగా లేదు.
YouTube video player

ఈ ప్రోగ్రామ్ కి సంబంధించిన ప్రోమో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయింది. సాధారణంగా హేమ మీడియా ముందు చేసే హంగామా అంతా ఇంతా కాదు. మా ఎలక్షన్ సమయంలో నటుడు బాలాజీ చేతిని కొరికిన సంగతి వివాదాస్పదంగా మారింది. క్యాష్ ప్రోగ్రాం లో సుమ నీకు కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు అని హేమని అడగ్గా .. కొరకడం అని హేమ సమాధానం చెప్తుంది. దీంతో భయపడ్డ సుమ షో స్టేజ్ మొత్తం పరుగులు తీసింది. హేమ కూడా సుమని వెంబడిస్తూ పరుగులు తీసింది.ఈ ఎపిసోడ్ లో ఒకరి మీద ఒకరు వేసిన పంచులు, కౌంటర్లలో ఈ వారం ఎపిసోడ్ సందడిగా ఉండబోతోంది.