’1000 అబద్దాలు’ చిత్రంతో హీరోయిన్ గా పరిచయమైన ఎస్తేర్ ..ఆ తర్వాత కొన్ని తెలుగు సినిమాల్లో కనిపించింది. కానీ హీరోయిన్ గా అమ్మడికి అంత గుర్తింపు రాలేదు. దీంతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా టర్న్ అయింది. కానీ ఆ రకంగానూ బిజీ కాలేదు. ఈ క్రమంలో గాయకుడు నోయల్ ని ప్రేమించి పెళ్లి చేసుకోవడం..కాపురంలో కలతలతో విడిపోయింది. ఆ తర్వాత ఏస్తేర్ మళ్లీ కెరీర్ పై దృష్టి పెట్టింది. ఇతర భాషల్లోనూ కొన్ని సినిమాలు చేసింది.
కానీ ఎక్కడా సక్సెస్ అవ్వలేదు. తాజాగా బ్యూటీ పెద్ద ట్విస్ట్ ఇచ్చింది. నటిని మాత్రమే కాదు..నేను మల్టీట్యాలెంటెడ్ అనిపించింది. ఏకంగా మెగాఫోన్ చేత పట్టింది. కన్నడలో ’ది వేకెంట్ హౌస్’ అనే సినిమాని తెరకెక్కిస్తుంది. ఈ సినిమాకి అన్ని తానే. ఒకే ఒక్క సినిమాతో తానేంటో నిరూపించుకునే సంచలన ప్రయత్నం చేస్తుంది. ఈ సినిమాకి దర్శకత్వంతో పాటు, సంగీతం, స్క్రీన్ ప్లే, మాటలు, కథ, కాస్ట్యూమ్, పాటలు, గాయని, నిర్మాత ఇలా చాలా రంగాల్లో తన ప్రతిభ చూపించింది. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ కూడా పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అన్ని పనులు పూర్తిచేసి కన్నడ.. కొంకిణి భాషల్లో రిలీజ్ చేస్తున్నారు. ఇలా అన్ని విభాగాల్లో పనిచేయడం ఎలా ఉంది? అంటే అమ్మడు చాలా సింపుల్ గా సమాధానం ఇచ్చి ముగించింది.
’ నేను ఏ దర్శకుడి దగ్గర పని చెయ్యలేదు. కానీ డైరెక్ట్ చేయాలని ఉండేది. కొంత మంది ప్రోత్సాహం…ప్రశంసలు ఇలా జర్నీని ముందుకు తీసుకెళ్లాయి. డైరెక్షన్ పెద్ద కష్టమేమి కాదు. మనసు పెట్టి పనిచేస్తే ఏదైనా సులవే. చిన్ననాటి నుంచి సంగీతమంటే ఇష్టం. స్కూల్, కాలేజీ ల్లో ఎన్నో సంగీత పోటీల్లో పాల్గొని ప్రైజ్ లు గెలిచా. అలా సంగీతంపై మంచి పట్టు సాధించా. ’ది వేకెంట్ హౌస్’ విభిన్నమైన ప్రేమ కథా చిత్రం. మంగుళూరు దగ్గర ఒక ఫార్మ్ హౌస్ లో షూట్ చేసాం. అన్నిఅనుకున్నట్లు జరిగితే అక్టోబర్ లో రిలీజ్ చేస్తామని’ తెలిపింది.