Noel wife: తాను ఇప్పటివరకూ ఎన్ని సార్లు ఎన్ని రకాలుగా వివరణ ఇచ్చినా.. సమాధానం చెప్పినా తనకు మాత్రం తన డివోర్స్ గురించి, తన మ్యారేజ్ గురించి ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారని నటి ఎస్తర్ అన్నారు. దీనిపై ఈ మధ్య ఇన్‌స్టాలోనూ ఒక పోస్ట్ చేశానని, అసలు దాని గురించి మాట్లాడడం కూడా తనకు ఇష్టం లేదని ఆమె స్పష్టం చేశారు. అది కేవలం 6 నెలలకు సంబంధించింది మాత్రమేనని, అది అక్కడితో అయిపోయిందని ఆమె చెప్పారు.
అసలు ఆ విషయం గురించి తనకు మాట్లాడడం ఇష్టం లేదని తాను చెప్పాను కానీ, తన వెనకాల మాత్రం చాలా మంది దాని గురించి మాట్లాడుతున్నరని ఎస్తర్ అన్నారు. బిగ్‌బాస్‌లో గానీ, పాటల్లో గానీ వేరే వేరే విధాలుగా తనకు ఏ మాత్రం సంబంధం లేకుండా, తన ఇన్వాల్వ్‌మెంట్ లేకుండా తన వెనకాల ఎవరెవరో ఆ బిగ్‌బాస్‌లో ఉన్న కంటెస్టంట్స్ తన గురించి మాట్లాడుతున్నరని ఆమె వాపోయారు. వాళ్లను ప్రశ్నిస్తున్నారు.. మీకు నోయెల్ ఏమైనా చెప్పారా వారి డివోర్స్ గురించి అని ఆమె అన్నారు. అవును ఎస్తర్ ఇలా అంట అని వాళ్లు తన గురించి మాట్లాడుతున్నరని ఆమె తెలిపారు. కానీ తనకు మాత్రం వారెవరో కూడా తెలియదని ఆమె స్పష్టం చేశారు.
అలా జరగడం అనేది ఎప్పటికీ తన చేతుల్లో ఉండదు. కానీ తాను ఏదైతే చెప్పానో ఇప్పటివరకూ అదే చేశానని ఆమె అన్నారు. ఇప్పటివరకూ తాను ఎవరితోనూ తమ డివోర్స్ గురించి ఎవరి గురించీ చెప్పలేదని ఆమె తెలిపారు. కానీ ఎవరో తనకు తెలియని వాళ్లు కూడా తన గురించి మాట్లాడుతున్నరని ఆమె చెప్పారు. దానికి తాను సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని ఆమె అన్నారు. వద్దని చెప్పినా తాను మాట్లాడాల్సి వస్తుంది ఎందుకంటే ఈ ఒక్క రీజన్ వల్లేనని, అందుకే దానిపై క్లారిటీ ఇస్తున్నానని ఆమె చెప్పారు. కానీ తనను ఇంకోసారి ఈ విషయంలో ప్రశ్నిస్తే.. సమాధానం ఇవ్వనని ఆమె అన్నారు.