నందమూరి బాలకృష్ణ బయట ఎంత హుందాగా ఉంటారో అందరికీ తెలుసు. కాకపోతే కొన్నిసార్లు ఆయన చేసే చిలిపి పనుల వల్ల అప్పుడప్పుడు నెగెటివ్ అవుతుంటారు. మైకు పట్టుకుంటే చాలు ఆయన ఒక్కోసారి ఏం మాట్లాడుతారో ఆయనకే తెలియదు. దాని వల్ల ఒక్కోసారి బ్యాడ్ అవుతుంటారు. అంతే కానీ.. ఆయన పెద్దగా ఎవ్వరినీ టార్గెట్ చేసింది లేదు. దానితో పాటుగా ఆయన పెద్దగా సోషల్ మీడియలోనూ యాక్టివ్ గా ఉండవు. ఆయన సినిమాల గురించి కూడా పెద్దగా ప్రచారం చేసుకోరు. ఆయనకు ఆయన పబ్లిసిటీ కూడా చేసుకోరు. తన పనేదో తనది. సినిమాలే ఆయన ప్రపంచం. సినిమాలు చేస్తూ పోతుంటారు. కాకపోతే అప్పుడప్పుడు బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రికి వెళ్లి వస్తుంటారు. ఇదే ఆయన జీవన ప్రయాణం.
అయితే.. తాజాగా ఆయన మీద ఓ హాట్ హీరోయిన్ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. ఆమె కూడా మామూలు హీరోయిన్ కాదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఆ హీరోయిన్ గురించే టాపిక్. ఇంతకీ ఎవరా గర్ల్ అంటారా? ఇంకెవరు.. ఆర్‌జివి హీరోయిన్. ఆర్‌జివి థ్రిల్లర్ మూవీలో నటించింది కదా అప్సరా రాణి అలియాస్ అంకిత మహారాణా. ఆమె.. సడెన్ గా బాలయ్య వైపు టర్న్ అయింది.
బాలయ్య గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చింది. అంతా బాగానే ఉన్నది కానీ.. బాలయ్యతో కలిసి ఈమె ఏ సినిమాలోనూ నటించలేదు కదా. వీళ్లిద్దరికి ఎలా పరిచయం అయిందబ్బా.. అని అనుకుంటున్నారా ?
నిజానికి ఆమె బాలయ్యతో కలిసి నటించలేదు. కానీ.. కేఎస్ రవికుమార్ డైరెక్షన్ లో బాలయ్య నటించిన రూలర్ సినిమా వచ్చింది కదా. ఆ సమయంలోనే అప్సర బాలకృష్ణను కలిసిందట. అప్పుడు ఆయన బిహేవియర్ చూసి ఒక్కసారిగా షాక్ అయిందట. అసలు.. ఆయన్ను బయట ఎలా ఊహించకుంటారు. కానీ.. ఆయన అసలు మనస్తత్వం చూసి ఒక్కసారిగా నామతి పోయింది అంటూ అప్సర రాణి, చెప్పుకొచ్చింది.
ఇక నేను పొద్దున్నే ఆయన ఇంటికి వెళ్లా. అప్పటికే ఆయన వర్కవుట్స్ చేస్తున్నారు. ఆసమయంలో వెళ్లడంతో ఆయన్ను కలవడం కాస్త లేట్ అయింది. దీంతో నన్ను వెయిట్ చేయించినందుకు సారీ చెప్పారు. నాతో పాటు నా తల్లి కూడా వచ్చింది. నాతో, నా తల్లితో చాలా హుందాగా మాట్లాడారు. అంత పెద్ద స్టారు ఎంతో హుందాగా మాతో ప్రవర్తించడం చూసి మేం షాక్ తిన్నాం. నా సినిమాలు ఏవైనా చూశావా అని నన్ను ఆయన అడిగారు. దానికి నేను చూడలేదు అని చెప్పా. దీంతో వెంటనే తన ట్యాబ్ ఓపెన్ చేసి ఆయన నటించిన కొన్ని సినిమాల సీన్స్ చూపించి బాలయ్య ఎంతో మురిసిపోయారు.
అంతే కాదు.. ఆయనతో మాట్లాడటం పూర్తయ్యాక.. మేం వెళ్తుంటే మా దగ్గరికి వచ్చి కార్ డోర్ కూడా ఆయనే తీశారు. అప్పుడు నాకు కాస్త భయం వేసినా.. ఆయన హుందాతనం చూసి చాలా ముచ్చటేసింది. ఈకాలంలో ఇంత హుందాగా ప్రవర్తించే స్టార్ ఉంటారా? అనిపించింది. కానీ.. ఆయన గురించి బయట ఎందుకు అంతలా నెగెటివ్ గా ప్రచారం చేస్తారో మాత్రం నాకు అర్థం కావడం లేదంటూ చెప్పుకొచ్చింది అప్సర.