అసభ్యకరమైన ఫోటో షేర్ చేసింది.. వెంటనే డిలీట్ చేసింది.. అపూర్వ రచ్చ!

ఒక్కోసారి సోషల్ మీడియాలో కొన్ని వింతలు జరుగుతుంటాయి. కొందరు సెలెబ్రిటీలు కొన్ని పోస్ట్‌లు చేస్తుంటారు.. మళ్లీ వెంటనే తొలగిస్తారు. ఇంకొందరు కొన్ని ఫోటోలు షేర్ చేస్తుంటారు.. తప్పు తెలుసుకుని వెంటనే డిలీట్ చేస్తుంటారు. కానీ అంతలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. కొన్ని ఫోటోలు అసభ్యకరంగా ఉండవని ఆలోచించే షేర్ చేస్తుంటారు.. కానీ మళ్లీ వెంటనే డిలీట్ చేసేస్తుంటారు.

Actress Apoorva Shares And Deleted Her Pic
Actress Apoorva Shares And Deleted Her Pic

టాలీవుడ్ నటి అపూర్వ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. వరుసగా రోజూ ఏదో ఒక ఫోటో షేర్ చేస్తూ రచ్చ చేస్తూనే ఉంటుంది. షూటింగ్ గ్యాప్‌లో దిగిన ఫోటోలు, తీసిన వీడియోలు షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. ఈ మధ్యే తన ఇంట్లొ జరిగిన ఓ బర్త్ డే ఈవెంట్‌కు సంబంధించిన వీడియోను షేర్ చేసింది. తాజాగా ఓ కుక్కు పిల్లను రైడ్‌కు తీసుకెళ్లిన వీడియోను షేర్ చేసింది.

Actress Apoorva Shares And Deleted Her Pic
Actress Apoorva Shares And Deleted Her Pic

అయితే తాజాగా అపూర్వ తెలిసి చేసిందో తెలియక చేసిందో గానీ ఓ తప్పు చేసేసింది. ఓ అసభ్యకరమైన తన ఫోటోను అపూర్వ షేర్ చేసింది. కాసేటికే ఆ ఫోటోను డిలీట్ చేసేసింది. కానీ అంతలోపే ఆ ఫోటో తెగ వైరల్ అయింది. బయట చక్కర్లు కొట్టేసింది. అయితే ఈ ఫోటోను ఎందుకు షేర్ చేసిందో మాత్రం తెలియడం లేదు. ఏది ఏమైనా అపూర్వ మాత్రం ఈ ఫోటోతో మరోసారి వార్తల్లో నిలిచింది.