సినీ నటుడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయిన సుబ్బరాజు తన 47 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకుని అందరికీ షాక్ ఇచ్చాడు. పెళ్లి చేసుకున్నట్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఫోటోలు కూడా షేర్ చేశాడు. పెళ్లి చేసుకోను, పెళ్లి ఇష్టం లేదు, పెళ్లి చేసుకోకపోతే బ్రతకలేమా అంటూనే పెళ్లి చేసుకొని ఆ ఫోటోలు సోషల్ మీడియాలో పెట్టిన సుబ్బరాజు ఎవరిని పెళ్లి చేసుకున్నాడు ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి అంటూ ఆరాలు తీస్తున్నారు జనాలు. ఆమె ఎవరో ఏమిటో మనం కూడా తెలుసుకుందాం.
సుబ్బరాజు పెళ్లి చేసుకున్న వధువు పేరు స్రవంతి. ఆమె అమెరికాలోని ఫ్లోరిడాలో డెంటిస్ట్ గా విధులు నిర్వహిస్తుంది. కొలంబియా యూనివర్సిటీ జాన్స్ హప్సిన్స్ యూనివర్సిటీల నుంచి స్రవంతి బిడిఎస్, డిడిఎస్ పట్టాలని పొందారు సోషల్ మీడియాలో కూడా ఆమెకి ఖాతా ఉంది. ఇన్స్టా బయోలో తన ఫస్ట్ లవ్ సైన్ మ్యారీడ్ టు ఫిట్నెస్ అని పెట్టారు. తనకి డ్యూటీ అంటే ప్రాణం అన్నట్లుగా ఆమె సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్గా షేర్ చేసే పోస్టర్లను బట్టి అర్థమవుతుంది.
ఇక వీరిద్దరి పెళ్లి సింపుల్ గా బంధువులు, చాలా తక్కువ మంది సన్నిహితుల మధ్య జరిగింది. పెళ్లి ఫోటోలు చూస్తుంటే పెళ్లికూతురు ది పెద్ద వయసుగా అనిపించడం లేదు. సుబ్బరాజు కంటే చాలా చిన్న వయసే అని తెలుస్తుంది. అయితే వీరు చాలా కాలంగా ప్రేమించుకుంటున్నారని అండర్స్టాండింగ్ తోనే లేటుగా పెళ్లి చేసుకున్నారని కొంతమంది చెప్తున్నారు. సింగర్ స్మిత వీరి పెళ్లికి హాజరు కావడం విశేషం.
త్వరలోనే హైదరాబాదులో సినీ సెలబ్రిటీల సమక్షంలో రిసెప్షన్ కూడా జరగబోతుందని సమాచారం. సోషల్ మీడియా వేదికగా తనకి వివాహ శుభాకాంక్షలు చెప్పిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ సుబ్బరాజు ట్వీట్ చేశారు. ఇక సుబ్బరాజు కెరియర్ విషయానికి వస్తే అనుకోకుండా నటుడు అయిన సుబ్బరాజు పేరుకే క్యారెక్టర్ ఆర్టిస్ట్ కానీ హీరోలకి ఏమీ తీసిపోడు. మంచి ఫిజిక్ తో హ్యాండ్సమ్ గా ఉంటాడు 50 ఏళ్లకు దగ్గర పడుతున్న ఇప్పటికీ 3 ఏళ్ల కుర్రాడిలాగానే కనిపిస్తాడు.