టాలీవుడ్ నటి ప్రగతి సోషల్ మీడియాలో చేస్తోన్న రచ్చ గురించి అందరికీ తెలిసిందే. లాక్ డౌన్ మొదలైనప్పటి నుంచి ప్రగతి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూనే ఉంది. మాస్ స్టెప్పులతో దుమ్ములేపిన ప్రగతి, క్లాస్ స్టెప్పులతో అందర్నీ ఆకట్టుకుంది. ఈ డ్యాన్సులన్నీ ఒకెత్తు అయితే వర్కవుట్ల వీడియోలు మరో లెవెల్. నాలుగు పదుల వయసులో కూడా ప్రగతి ఓ లెవెల్‌లో వర్కవుట్లు చేస్తూ ఎంతో మందిలో స్ఫూర్తి నింపుతోంది.
ప్రగతి తాజాగా తన రెగ్యులర్ పనిలో పడింది. షూటింగ్ సెట్‌లో సందడి చేస్తోంది. ఈ మధ్యే ఓ యాడ్ షూటింగ్‌లోనూ సందడి చేసింది. నితిన్‌తో కలిసి షూటింగ్ సెట్‌లో చేసిన హల్చల్ అందరికీ తెలిసిందే. అయితే ప్రగతి ఇంత కష్టపడుతున్నా మళ్లీ తల్లిపాత్రల్లోనూ నటిస్తోన్నట్టు కనిపిస్తోంది. ఎంత గ్లామర్‌గా కనబడినా డీ గ్లామర్, తల్లి పాత్రల్లోనే ప్రగతి కనిపిస్తోంది. తాజాగా ప్రగతి షేర్ చేసిన వీడియో ఒకటి తెగ వైరల్ అవుతోంది.
జిమ్‌లో ప్రగతి చేసే ఫీట్లు అందరికీ తెలిసిందే. ప్రతీ రోజూ క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తోన్న ప్రగతి నేడు వంద కేజీల బరువును ఎత్తింది. చూస్తుంటే ప్రగతి ఏదైనా ఒలంపిక్స్ గేమ్స్‌లో పార్టిసిపేట్ చేసేలా వీర లెవెల్‌లో కష్టపడుతోంది. ప్రస్తుతం ప్రగతి వర్కవుట్ల వీడియోలు ఓ రేంజ్‌లో వైరల్ అవుతున్నాయి.