షోలో ఏ కంటెంట్ చూపించాలి, ఎవరి మాటలు మనం వినాలి? ఎవరిని చూడాలి? ఇలాంటి విషయాలన్నీ బిగ్‌బాస్ 4 టీంపైనే ఆధారపడి ఉంటాయి. 24 గంటల్లో మనం చూసేది కేవలం గంట కూడా ఉండదు. అందులో 16 మంది కంటెస్టెంట్లు, వారి మాటలు, వారి చేష్టలు ఎన్నో ఉంటాయి. కానీ ఒక్కో ఎపిసోడ్‌లో కొందరు అసలు కనబడనే కనబడరు. వారున్నారని కూడా ఎవ్వరూ పట్టించుకోరు. ఇలా జిమ్మిక్కులన్ని చేసేది బిగ్‌బాస్ టీం.
అయితే ఈసారి మాత్రం బిగ్‌బాస్ ఎడిటర్లు తమ ప్రతిభకు బాగానే పదును పెడుతున్నారు. ఎందుకంటే ఏ టైంలో ఎవరి హావభావాలు చూపించాలి, ఎంతలో చూపించాలి, ఎలాంటి పరిస్థితుల్లో చూపించాలి అనే విషయాలు బాగా పసిగట్టినట్టున్నారు. మోనాల్ విషయం వచ్చేసరికి అఖిల్‌ను ఓ రేంజ్‌లో చూపిస్తున్నారు. అతని చూపులే తేడాగా ఉన్నాయి. ఆ చూపుల్లో ఎంతో విషయం, కోపం, జెలసీ, ద్వేషం దాగి ఉన్నట్టు కనిపిస్తున్నాయి.
ఇక నిన్నటి ఎపిసోడ్‌లో మోనాల్, సోహెల్ డ్యాన్స్ రిహార్సల్స్ చేయడం వాటిని అఖిల్ జీర్ణించుకోలేకపోవడం, అందుకు తగ్గట్టు ఫేస్‌లో ఎక్స్ ప్రెషన్స్ మారుతుండటం.. అందులోనూ అఖిల్‌ను క్లోజప్‌లో చూపించడం, ఇక డ్యాన్స్ పర్ఫామెన్స్ చేసిన సమయంలోనూ అఖిల్ మొహంలో రంగులు మారుతుండటాన్ని కూడా క్లోజప్‌లో చూపించారు. ఇలా బీబీ ఎడిటర్ల టాలెంట్‌ను గీతామాధురి భర్త నందు గమనించాడు. తన తదుపరి ప్రాజెక్ట్ కోసం వారినే ఎడిటర్లుగా పెట్టుకుంటానని, ఎక్కడ క్లోజప్ వేయాలో వారికి తెలుసంటూ సెటైర్లు వేశాడు.