టాలీవుడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ బ్రహ్మాజి సోషల్ మీడియాలో చేసే రచ్చ అందరికీ తెలిసిందే. ఎవరికి ఎలా కౌంటర్లు ఇస్తాడో, రూమర్లు, ఫేక్ న్యూస్‌పై ఎలాంటి కామెంట్లు చేస్తాడో ఎన్నో సందర్భాల్లో చూశాం. కరోనా, లాక్ డౌన్ సమయంలో బ్రహ్మాజి వేసిన సెటైర్లు ఓ రేంజ్‌లో వర్కవుట్ అయ్యాయి. లాక్ డౌన్‌ను దశల వారీగా పెంచుకుంటూ పోవడంతో బ్రహ్మాజి పంచ్‌లు వేశాడు. ఆ మధ్య ఓ సినిమాలోని బ్రహ్మాజీ యాభై యేళ్ల వయసున్న వ్యక్తి పాత్రను పోషిస్తున్నాడని వచ్చిన వార్తలపై సెటర్లు వేయగా అది బాగా వైరల్ అయింది.
మళ్లీ కొన్ని రోజుల క్రితం ఓ నెటిజన్‌కు బ్రహ్మాజి ఇచ్చిన కౌంటర్ బాగా వైరల్ అయింది. సోనూసూద్, బండ్ల గణేష్ నెటిజన్ల ట్వీట్లకు స్పందిస్తూ.. ఎంతో కొంత సాయం చేస్తుంటారు. అలాగే ఓ నెటిజన్ బ్రహ్మాజీని బ్యాట్ కొనివ్వమని అడిగాడు. దానికి స్పందించిన బ్రహ్మాజీ.. ఇదిగో నచ్చినవి తీసుకో అంటూ బ్యాట్ ఎమోజీలను షేర్ చేశాడు. అది ఆ సందర్భానికి తగినట్టు బాగా ఉండటంతో పాజిటివ్ రియాక్షన్లు వచ్చాయి.
కానీ తాజాగా బ్రహ్మాజీ చేసిన ట్వీట్ మాత్రం ఇళ్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. ఇంకేదో కాలి ఇంకొకడు ఏడుస్తున్నాడంటా అని సామెత ఉన్నట్టు హైద్రాబాద్‌లో వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ఈ సందర్భాన్ని కూడా బ్రహ్మాజి కామెడీ చేసేశాడు. నాకు ఓ మోటార్ బోట్ కొనుక్కోవాలని ఉంది.. ఎవరైనా ఏదైనా సలహాలు, సూచనలు ఇస్తారా? అని సెటైర్ వేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్ర స్థాయిలో భగ్గుమన్నారు. ఇలాంటి సమయంలో అలాంటి ట్వీట్లు వేయడమేంటని మండిపడుతున్నారు.