దెబ్బ అదుర్స్ కదూ.. ఇంకోసారి బ్రహ్మాజీతో పెట్టుకోకండి!

టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటాడో అందరికీ తెలిసిందే. తెరపై ఎంత చలాకీగా ఉంటూ పంచ్‌లు వేస్తాడో సోషల్ మీడియాలో అంతకు మించిన ఎంటర్టైన్మెంట్‌ను ఇస్తాడు. బ్రహ్మాజీపై వచ్చే రూమర్లను, గాసిప్ వార్తలను అంతే రేంజ్‌లో తిప్పి కొడతాడు. ఒక్కోసారి బ్రహ్మాజి వేసే సెటైర్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంటాయి. తాజాగా ఓ నెటిజన్‌కు బ్రహ్మాజి గట్టిగా ఇచ్చి పడేశాడు.

Actor Brahmaji Counter To Netizen Who Asked Bat
Actor Brahmaji Counter To Netizen Who Asked Bat

మామూలుగా ఈ మధ్య కొందరు సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో సాయం చేస్తూ పెద్ద మనసును చాటుకుంటున్నారు. సోనూ సూద్ ఇచ్చిన స్ఫూర్తో లేదో ఇంకోటో గానీ అందరూ తమకు తోచిన సాయాన్ని చేస్తున్నారు. ఇందులో ముఖ్యంగా బండ్ల గణేష్, మంచు మనోజ్ వంటి వారు ముందుంటారు. సాయం చేయండని ఎవరైనా అడిగితే అందులో నిజం, నిజాయితీ ఉంటే సాయం చేస్తారు. అయితే తాజాగా బ్రహ్మాజిని ఆట పట్టించిన ఓ నెటిజన్‌కు రివర్స్ కౌంటర్ వేశాడు.

Actor Brahmaji Counter To Netizen Who Asked Bat
Actor Brahmaji Counter To Netizen Who Asked Bat

తాజాగా ట్విట్టర్‌లో ఓ నెటిజన్.. అన్న ఒక మంచి క్రికెట్ బాట్ ఇవ్వు అన్నా.. అని ట్వీట్ చేశాడు. ఇక సదరు నెటిజన్ చేసిన ట్వీట్‌కు స్పందించిన బ్రహ్మాజీ అదిరిపోయే రిప్లై ఇచ్చాడు. మంచిది ఒకటి సెలెక్ట్ చేసుకో అంటూ బ్యాట్ ఎమోజీలను షేర్ చేశాడు. ఇక బ్రహ్మాజీ ఇచ్చిన రిప్లైకు నెటిజన్లు ఆశ్చర్యపోతూ మీమ్స్‌తో రచ్చ చేస్తున్నారు. ఇంకోసారి బ్రహ్మాజీతో పెట్టుకోకండి అంటూ కౌంటర్లు వేసింది.