దసరా షూటింగ్ లోకేషన్ లో ప్రమాదం… ప్రమాదం నుండి బయటపడిన నాని!

అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన నాని ఎటువంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేకుండానే హీరోగా మంచి గుర్తింపు పొందాడు. నాని తన సహజమైన నటులతో ప్రేక్షకులను బాగా అలరించటంతో నాచురల్ స్టార్ గా మంచి గుర్తింపు పొందాడు. రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ఈగ సినిమా ద్వారా నాని స్టార్ హీరోగా పాపులర్ అయ్యాడు. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న నాని ఇటీవల విడుదలైన శ్యామ్ సింగరాయ సినిమాతో మంచి హిట్ అందుకున్నాడు. అంతే కాకుండా ఇటీవల విడుదలైన ‘అంటే సుందరానికి ‘ సినిమా కూడ మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇదిలా ఉండగా ప్రస్తుతం నాని దసరా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో నాని పక్క మాస్ లుక్ తో కనిపించనున్నాడు. ఈ సినిమా నుండి విడుదలయిన పోస్టర్స్ సినిమా మీద ప్రేక్షకులకు అంచనాలను పెంచుతున్నాయి. ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ నటించనుంది. ఇప్పటికే వీరిద్దరూ కలసి ‘నేను లోకల్ ‘అనే సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అయ్యింది. ఇక ప్రస్తుతం వీరిద్దరూ కలిసి నటిస్తున్న ‘ దసరా ‘ సినిమా షూటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. తాజాగా ఈ షూటింగ్ సమయంలో నాని ప్రమాదం నుండి బయటపడినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణలోని గోదవరిఖనిలో జరిగింది. షూటింగ్ సమయంలో నాని బొగ్గు ట్రక్కు కింద నాని ఉండగా… బొగ్గంతా అతడిపై పడినట్లు సమాచారం. అయితే అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో నాని ఎటువంటి గాయాల పాలవ్వకుండా ప్రమాదం నుండి బయటపడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనతో షూటింగ్ కి కొంతసమయం అంతరాయం కలిగింది. నాని రెడీ అయిన తర్వాత మళ్ళీ షూటింగ్ ప్రారంభించినట్టు సమాచారం. షూటింగ్ సమయాలలో అప్పుడప్పుడు ఎటువంటి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఇలాంటి ప్రమాదాల వల్ల హీరో హీరోయిన్లతో పాటు టెక్నిషియన్స్ కూడా ప్రమాదానికి గురయిన సంఘటనలు చాలా జరిగాయి.