బిగ్ బాస్ సీజన్ 4 బెస్ట్ కంటెస్టెంట్స్ లలో ఒకడిగా మంచి క్రేజ్ అందుకున్న అభిజిత్ తప్పకుండా టైటిల్ విన్నర్ అవుతాడని సోషల్ మీడియాలో ప్రచారాలు గట్టిగానే కొనసాగుతున్నాయి. అయితే అభి బిగ్ బాస్ లోకి వచ్చే ముందే స్పెషల్ గా ప్రమోషన్ టీమ్ ను సెట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. నిజానికి బిగ్ బాస్ లోకి అడుగు పెట్టె చాలా మంది కూడా ఈ తరహాలో బ్యాక్ గ్రౌండ్ లో టీమ్ ను సిద్ధం చేసుకోవడం కామన్.
కానీ ఎంత ప్రమోట్ చేసుకున్నా కూడా జనాల మద్దతు అందితేనే ఫైనల్ విన్నర్ అవుతారు. ఆ విషయంలో అభికి మాత్రం అర్హత ఉందని చెప్పవచ్చు. ఎలాంటి పరిస్థితులలో అయినా బలంగా పోరాడుతున్న ఈ కంటెస్టెంట్ తన సినిమాలకంటే కూడా ఒక విధంగా బిగ్ బాస్ ద్వారానే మంచి క్రేజ్ అందుకున్నాడు. అయితే బిగ్ బాస్ కోసం ప్రమోట్ చేసుకునేందుకు అభి వచ్చే ముందు ఒక డిజిటల్ మీడియా టీమ్ కు ప్రమోషన్ బాధ్యతలు ఇచ్చినట్లు సమాచారం.
అందుకోసం అభిజిత్ 50లక్షల వరకు ఖర్చు చేశారని కూడా రూమర్స్ వస్తున్నాయి. ఇక బిగ్ బాస్ విన్నర్ అయితే మాత్రం వచ్చిన ప్రైజ్ మనీ 50లక్షలు మొత్తం కూడా ఇంట్లో వాళ్ళకేనట. మొన్న ఈ విషయాన్ని ఓపెన్ గానే చెప్పాడు అభి. ఒకవేళ గెలిస్తే డబ్బుమొత్తం మీకే ఏం చేసుకుంటారో మీ ఇష్టం అంటూ వివరణ ఇచ్చాడు. అభి పేరెంట్స్.. ప్రమోషన్ కోసం ఖర్చు చేయడానికి ఏ మాత్రం వెనుకాడడం లేదట. ఎందుకంటే బిగ్ బాస్ అభి కెరీర్ కు ఉపయోగపడాలని వారు వారు డేరింగ్ స్టెప్ తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి అభి వారి నమ్మకాన్ని ఎంతవరకు నిలబెడతాడో చూడాలి.