త్వరలోనే వస్తాను.. ఫుల్ స్వింగ్‌లో ఉన్న అభిజిత్

Abhijeet Ready Surprise with Racing Video

బిగ్ బాస్ షో తరువాత అభిజిత్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన అభిజిత్.. బిగ్ బాస్ షో ద్వారా ప్రతీ ఇంట్లో మనిషిలా దగ్గరయ్యాడు. అంతలా క్రేజ్, ఫాలోయింగ్ తెచ్చుకున్న అభిజిత్ ఇప్పుడు ఫుల్ బిజీగా ఉంటున్నాడు. మామూలుగానే అభిజిత్‌కు రేసింగ్, లాంగ్ డ్రైవ్,అడ్వెంచర్లు అంటే ఎంతో ఇష్టం. ఆటల్లోనూ ఆరితేరి ఉన్నోడు. అలా అభిజిత్‌కు కొన్ని గాయాలు అవ్వడంతో కొన్ని ఆటలకు దూరంగా ఉంటున్నాడు.

Abhijeet Ready Surprise with Racing Video
Abhijeet Ready Surprise with Racing Video

అయితే ఇన్ని రోజులు బిగ్ బాస్ ఇంట్లో ఉండటంతో వాటి మీద పట్టు తప్పి ఉండచ్చు. అందుకే మళ్లీ తన నైపుణ్యాలకు పదును పెడుతూ ఉన్నట్టుంది. ఈ మధ్యే స్పోర్ట్స్ బైక్ వేసుకుని బయటకు వెళ్లాడు. ఎంతో స్టైలీష్‌గా తిరిగి వస్తున్న వీడియోలను షేర్ చేశాడు. లైఫ్ ఆఫ్ రామ్‌లాగా లైఫ్ ఆఫ్ అభిజిత్ వీడియోను ఏదో ప్లాన్ చేస్తోన్నట్టు కనిపిస్తోంది. అభిజిత్ తాజాగా మరో వీడియోను షేర్ చేశాడు. ఇందులోనూ అభిజిత్ తన డ్రైవింగ్ స్కిల్‌ను మెరుగుపర్చుకుంటున్నాడు.

మామూలుగా బిగ్ బాస్ ఇంట్లో వంద రోజులకు పైగా ఇంట్లోనే ఉండటంతో అన్ని మర్చిపోతుంటారు. కనీసం సెల్ ఫోన్ ఎలా వాడాలో కూడా సరిగ్గా గుర్తుకు రాదు. అందుకే అభిజిత్ ఇప్పుడు జీప్‌ను గింగిరాలు తిప్పేలా నడిపిస్తున్నాడు. స్పెషల్ ఫోటో షూట్, వీడియోలు కూడా తీస్తున్నాడు. త్వరలోనే వీడియో రిలీజ్ అవుతుందని అభిజిత్ ప్రకటించేశాడు. మొత్తానికి బిగ్ బాస్ ద్వారా వచ్చిన క్రేజ్‌‌ను అభిజిత్ ఉపయోగించుకునేలానే ఉన్నాడు. సినిమా ఆఫర్లను కూడా ఆచితూచి ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది.