బాలీవుడ్ హాట్ బ్యూటీ పరిణీతి చోప్రా, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అయిన ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దాతో ప్రేమలో ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే వీరు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారట. ఈ క్రమంలోనే నిశ్చితార్థానికి కూడా ముహూర్తాలు ఫిక్స్ అయ్యాయని సమాచారం. ఈనెల 13వ తేదీన వీరిద్దరూ కుటుంబ సభ్యులు, అతి తక్కువ మంది సన్నిహితుల మధ్య ముంబైలో ఉంగరాలు మార్చుకోబోతున్నారు.
రాజ్యసభ సభ్యుడు అయిన రాఘవ్ చద్దా రాజకీయాల్లో చురుగ్గా రాణిస్తున్నారు. ఓ వైపు ఎంపీగా తన బాధ్యతలు నిర్వహిస్తూనే ఢిల్లీ, పంజాబ్ లలో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ కోసం కష్టపడుతున్నారు. గతంలో ఢిల్లీ అసెంబ్లీకి రాఘవ్ చద్దా ఎన్నికయ్యారు. ఎమ్మెల్యేగా కొనసాగుతుండగానే పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేశారు.
మరోవైపు పరిణీతి చోప్రా కూడా వరుసగా సినిమాలు చేస్తూ చాలా బిజీగా గడుపుతున్నారు. అయితే వీరిద్దరూ ఏదో ఫంక్షన్ లో కలుసుకోగా ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. ముంబయిలోని ఓ రెస్టారెంట్ లో లంచ్ చేస్తూ వీరి మీడియాకు చిక్కారు. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య ఏదో నడుస్తుందని పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఇది జరిగిన తర్వాత కూడా వీళ్లు చాలా సార్లు బయట కనిపించారు. దీంతో వీరిద్దరూ లవ్ లో ఉన్నట్లు అంతా ఫిక్స్ అయిపోయారు.
అయితే పరిణీతి చోప్రా, రాఘవ్ చద్దాల ఎంగేమ్ మెంట్ రోజే వారు వారు ఎప్పుడు, ఎక్కడ పెళ్లి చేసుకోబోతున్నారో ప్రకటించే అవకాశం ఉందని అంతా అనుకుంటున్నారు. ముఖ్యంగా ప్రస్తుతం వీరిద్దరూ చాలా బిజీగా ఉన్నందున ఈ ఏడాది అక్టోబర్ చివరి వారంలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్కటి అయ్యే ఛాన్స్ ఉందని సమాచారం. చూడాలి మరి ఎంగేజ్ మెంట్ రోజు వీరు పెళ్లి ఎప్పుడో ప్రకటిస్తారా లేదా అనేది.
గత కొంత కాలం క్రితమే వీరిద్దరికీ రోకా వేడుక జరిగినట్లు పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కేవలం ఇరు కుటుంబ సభ్యుల మధ్యే ఈ కార్యక్రమం జరిగిందని పుకార్లు లేచాయి. వీటిపై అటు పరిణీతి చోప్రా కానీ, ఎంపీ రాఘవ్ చద్దా కానీ స్పందించలేదు. మరి చూడాలి ఏం జరగనుందనేది. ఈనెల 13వ తేదీన వీరిద్దరి ఎంగేజ్ మెంట్ మాత్రం కచ్చితంగా జరగబోతుందట.