Aadya: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె బద్రి సినిమా ద్వారా పవన్ కళ్యాణ్ తో నటించి అనంతరం ప్రేమలో పడి వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే వీరికి అకీరా, ఆధ్య అనే ఇద్దరు పిల్లలు కలరు. కొంతకాలం పాటు వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉన్నప్పటికీ మనస్పర్థల కారణంగా రేణుదేశాయ్ పవన్ కళ్యాణ్ కు విడాకులు ఇచ్చి తన పిల్లలతో కలిసి పూణేలో నివసిస్తున్నారు. ఇలా రేణుదేశాయ్ తన పిల్లల బాధ్యతలను చూసుకుంటూ దర్శకనిర్మాతగా పని చేస్తున్నారు.
అలాగే బుల్లితెరపై పలు కార్యక్రమాలకు న్యాయనిర్ణేతగా కూడా వ్యవహరించారు. కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే రేణుదేశాయ్ తన పిల్లలు విషయంలోనూ, సామాజిక అంశాలపై కూడా స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా తెలియజేస్తుంటారు. ఇక తన పిల్లల్లో దాగి ఉన్న టాలెంట్ నిత్యం బయటపెడుతూ వారికి సంబంధించిన వీడియోలను ఈమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంటారు. ఇదిలా ఉండగా రేణుదేశాయ్ తాజాగా తన కూతురు ఆధ్యకు సంబంధించిన ఒక వీడియోను ఇన్స్టాగ్రామ్ ద్వారా షేర్ చేశారు.
ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది పవన్ అభిమానులు పవన్ కూతురా మజాకా.. పవన్ కూతురు అంటే ఇలాగే ఉండాలి కదా అంటూ కామెంట్లు చేయడంతో రేణు దేశాయ్ ఎంతో మురిసిపోతున్నారు. ఇక ఈ వీడియోలో ఏముంది అనే విషయానికి వస్తే ఆధ్య గిటార్ వాయిస్తూ ఎంతో అద్భుతంగా పాట పాడుతూ ఉంది. ఈ క్రమంలోనే ఈ వీడియోను రేణు దేశాయ్ షేర్ చేయడంతో ఈ వీడియో వైరల్ అయింది. మరి ఇంకెందుకు ఆలస్యం ఆద్య టాలెంట్ పై మీరు ఓ లుక్కేయండి.