కృతి పాపకి చెప్పి మరీ తీసుకొచ్చినాగానీ.!

‘నువ్వు సీత పాత్రలో నటిస్తున్నావ్.. చాలా చాలా జాగ్రత్త..’ అని ‘ఆదిపురుష్’ టీమ్, బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్‌కి బాగా ట్రెయినింగ్ ఇచ్చి తీసుకొచ్చిందట సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి.

అయినాగానీ, ఈ ఈవెంట్‌లో షరామామూలుగానే, ‘హగ్స్’ ఇచ్చేసింది.. అదీ టీమ్ మెంబర్స్‌కి. ఓ నమస్కారంతో సరిపెడితే పోయేదానికి, కృతి ఇలా ఎందుకు చేసింది.? సరే, అయ్యిందేదో అయ్యింది.. ఇక చాలు.. అంటూ, మళ్ళీ ఆమెకు క్లాస్ తీసుకున్నారట. కానీ, ఈసారి ఏకంగా తిరుమలలో వెంకన్న దర్శనానంతరం, ‘హగ్స్’ ఇచ్చేసింది. ఈసారి దర్శకుడు ఓం రౌత్‌కి.

ముద్దుల పర్వం కూడా నడిచింది. మర్యాదపూర్వకంగా.. గౌరవ పూర్వకంగా.. అభినందన పూర్వకంగానే అయినా, వ్యవహారం తేడా కొట్టింది. ‘ఆదిపురుష్’ మీదున్న భక్తి భావన కాస్తా, ఇప్పుడు ప్రేక్షకుల్లో పోయిందంటే దానిక్కారణం కృతి సనన్ అతి.. అనుకోవాలేమో.!