“సలార్” ఐటం సాంగ్ లో ట్విస్ట్.?

prabhas_salaar_prashanth_neel_shoot_

ఈ ఏడాదికి చివాలో బాక్సాఫీస్ దగ్గర బిగ్గెస్ట్ బ్లాస్ట్ గా రాబోతున్న పలు క్రేజీ చిత్రాల్లో అయితే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బిగ్గెస్ట్ అండ్ అవైటెడ్ ఏక్షన్ డ్రామా చిత్రం “సలార్” కూడా ఒకటి. మరి పాన్ ఇండియా లెవెల్లో ఏక్షన్ ఆడియెన్స్ ఓ రేంజ్ లో ఎదురు చూస్తున్న ఈ సినిమా నున్నచీ ట్రైలర్ ని కూడా మేకర్స్ అనౌన్స్ చేసేసారు.

ఇక ఆ రోజు కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ మాసివ్ ప్రాజెక్ట్ కి సంబంధించి లాస్ట్ మినిట్ ఎందుకో మేకర్స్ చాలా ప్లాన్ లు చేంజ్ చేసారు. అలా లాస్ట్ మినిట్ లోనే ఐటెం సాంగ్ ని కూడా చేర్చారు. యంగ్ హీరోయిన్ సిమ్రాత్ కౌర్ అయితే ఈ సాంగ్ షూట్ ని చేసినట్టుగా కన్ఫర్మ్ చేసింది.

అయితే ఇప్పుడు ఈ సాంగ్ పై లేటెస్ట్ ట్విస్ట్ ఏమిటంటే ఈ సాంగ్ లో అసలు ప్రభాస్ ఎక్కడా ఉండడట. ఇదే ఇక్కడ మ్యాజిక్కు. మరి హీరో లేకుండా ఐటెం సాంగ్ ఎలా అనేది ఇపుడు చాలా మంది ఆలోచిస్తున్నారు. బహుశా విలన్ గ్యాంగ్ తో కావచ్చని కొందరు అనుకుంటున్నారు కానీ అసలు హీరో ప్రెజెన్స్ లేకుండా అంటే కాస్త ఆలోచించాల్సిందే.

ఇక ఈ భారీ చిత్రం ప్రమోషన్స్ నెమ్మదిగా స్టార్ట్ కానుండగా ఇప్పుడు సినిమా యూనిట్ అంతా పోస్ట్ ప్రొడక్షన్స్ మరియు ప్యాచ్ వర్క్ లు ముగించే పనిలో ఉన్నారు. ఇక ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా పృథ్వీ రాజ్ మరియు జగపతి బాబ్ తదితరులు నటిస్తున్నారు. ఇక వరల్డ్ వైడ్ గా ఈ సినిమా ఈ డిసెంబర్ 22న రిలీజ్ కాబోతుంది.