గంగవ్వకి నాగార్జున ఇచ్చిన మాట ఖరీదు అంతా?

A total of Rs 26 lakh will be spent for the Gangava house

బిగ్ బాస్ షోకు వచ్చిన గంగవ్వ హౌస్ నుంచి బయటకు వెళ్లే సమయంలో నాగార్జునను ఇల్లు కట్టించాలని కోరడం, నాగార్జున కూడా బిగ్ బాస్ షో వేదికపై ఇల్లు కట్టిస్తానని హామీ ఇవ్వడం తెలిసిందే.బిగ్ బాస్ షో గ్రాంఢ్ ఫినాలే సమయంలో గంగవ్వ ఇంటి పనులు ఇప్పటికే మొదలైనట్లు ఒక వీడియో ప్రసారమైంది.మరోవైపు గంగవ్వకు బిగ్ బాస్ షో నుంచి రెమ్యునరేషన్ కు సంబంధించిన చెక్కులు ఇప్పటికే అందాయి.బిగ్ బాస్ నుంచి వచ్చిన డబ్బులలో కొంత మొత్తంతో గంగవ్వ బంగారం కొనుగోలు చేశారు.అయితే గంగవ్వ ఇంటి కోసం మొత్తం 26 లక్షలు ఖర్చు అవుతుందని ఆ మొత్తంతో నాగార్జున ఇంటి కోసం ఖర్చు చేయనున్నారని తెలుస్తోంది.

A total of Rs 26 lakh will be spent for the Gangava house

ఇప్పటికే గంగవ్వ ఇంటికి సంబంధించిన ప్లాన్ కూడా సిద్ధమైంది.గంగవ్వ కోరిక మేరకు ఆమె సొంతూరు లంబాడిపల్లెలోనే ఇంటి నిర్మాణ పనులు జరుగుతున్నాయి.గంగవ్వ విషయంలో నాగార్జున ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటూ ఉండటంపై నాగార్జున అభిమానులతో పాటు సాధారణ ఫ్యాన్స్ సైతం హర్షం వ్యక్తం చేస్తుండటం గమనార్హం.గంగవ్వ సైతం వీడియోల ద్వారా ఇంటికి సంబంధించిన విశేషాలను పంచుకుంటున్నారు.మరోవైపు బిగ్ బాస్ సీజన్ 4 సక్సెస్ కు ప్రధాన కారణమైన నాగార్జుననే బిగ్ బాస్ సీజన్ 5 ను కూడా హోస్ట్ చేయనున్నారని తెలుస్తోంది.కరోనా వల్ల ఈ ఏడాది బిగ్ బాస్ సీజన్ 4 ఆలస్యంగా ప్రారంభం కాగా బిగ్ బాస్ సీజన్ 5 మాత్రం వచ్చే ఏడాది జూన్ నుంచి ప్రసారం కానుందని తెలుస్తోంది.