ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ కాంబినేషన్ లలో ఒకటైన సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ల నుంచి రానున్న “గుంటూరు కారం” కోసం అందరికీ తెలిసిందే. అసలు ఈసారి ఎలాంటి మెసేజ్ లాంటిది లేకుండా పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ తో మహేష్ బాబు చేస్తున్న సినిమా ఇదే కావడంతో అయితే ఫ్యాన్స్ లో భారీ అంచనాలు దీనిపై నెలకొన్నాయి.
ఇక ఈ అవైటెడ్ చిత్రం కోసం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తుండగా దానికన్నా ముందు ఎదురు చూస్తున్న ఫస్ట్ సింగిల్ ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసారు. మరి గుంటూరు కారం నుంచి కావాల్సిన స్పైసి నెస్ తో థమన్ కంపోజ్ చేసిన ఈ సాంగ్ కి మొదటి రోజు మిక్స్డ్ స్పందన వచ్చినప్పటికీ ఇపుడు సాంగ్ మెల్లగా ఊపందుకుంటుంది.
అయితే లేటెస్ట్ గా సంగీత దర్శకుడు థమన్ పెట్టిన మరో పోస్ట్ వైరల్ గా మారింది. మరి అసలు గుంటూరు కారం అంటేనే ‘కారం’ కానీ అలాంటిది ఇపుడు స్వీట్ స్పైసి(తీపి కారం) అంటూ పోస్ట్ చేసాడు. అంటే ఈస్ట్ వచ్చేది గుంటూరు కారం నుంచి ఒక రొమాంటిక్ యాంగిల్ టైప్ సాంగ్ కావచ్చు అని చెప్పాలి.
మరి అదేంటి అనేది కొన్ని రోజులు వేచి చూడాలి. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీలీల మీనాక్షి చౌదరి లు నటిస్తుండగా సంక్రాంతి కానుకగా జనవరి 12న రిలీజ్ కాబోతుంది.
#SweetSpice 🌶️
— thaman S (@MusicThaman) November 11, 2023