డే 1 “ఆనిమల్” కి తెలుగు స్టేట్స్ లో అదిరే ఓపెనింగ్స్..!

ప్రస్తుతం టాలీవుడ్ యూత్ ని బాలీవుడ్ యూత్ ని కూడా షేక్ చేసుకున్న క్రేజీ సినిమా ఏదన్నా ఉంది అంటే అది బాలీవుడ్ నుంచి వచ్చిన మరో హిస్టారికల్ ఏ సర్టిఫికెట్ బ్రూటల్ హిట్ చిత్రం “ఆనిమల్” చెప్పి తీరాలి. ఆ సర్టిఫికెట్ తో రిలీజ్ అయ్యిన ఈ చిత్రం బాలీవుడ్ హిస్టరీ లోనే 100 కోట్లకి పైగా ఓపెనింగ్స్ అందుకున్న భారీ గ్రాసర్ గా నిలిచింది.

మరి ఈ సినిమా దర్శకుడు మన టాలీవుడ్ క్రేజీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ కావడంతో తెలుగులో కూడా మామూలు హైప్ తో ఈ సినిమా రాలేదు. దీనితో ఆనిమల్ కి తెలుగులో కూడా భారీ ఓపెనింగ్స్ ఉంటాయని చాలా మంది భావించారు. మరి అనుకున్నట్టుగానే ఈ చిత్రానికి హీరో రణబీర్ కెరీర్ లోనే రికార్డు ఓపెనింగ్స్ అయితే దక్కడం విశేషం.

కాగా బాలీవుడ్ ట్రేడ్ మొత్తం సౌత్ నుంచే 10 కోట్లు వచ్చాయని అంటున్నారు కానీ ఒక్క తెలుగు రాష్ట్రాల్లోనే ఆనిమల్ చిత్రం 15 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. 15 కోట్ల గ్రాస్ సహా 7 కోట్ల మేర షేర్ ని తెలుగు రాష్ట్రాల్లో ఆనిమల్ అందుకోగా తమిళ్ నుంచి కేవలం 1 కోటి గ్రాస్ మాత్రమే అందుకున్నట్టుగా ట్రేడ్ సర్కిల్స్ ప్రముఖులు చెప్తున్నారు.

దీని బట్టి మన ఆడియెన్స్ ఎలా చూస్తున్నారో అర్ధం చేసుకోవాలి. కాగా రెండో రోజు కూడా ఆనిమల్ కి స్ట్రాంగ్ వసూళ్లు తెలుగులో నమోదు కావడం విశేషం. మరి ఫైనల్ రన్ లో ఆనిమల్ మరింత స్ట్రాంగ్ వసూళ్లు అందుకున్నా ఎలాంటి ఆశ్చర్యం లేదని చెప్పాలి.