క్రేజీ : షాకింగ్ రన్ టైం తో “ఆనిమల్”..సందీప్ హిస్టరీ రీక్రియేట్ చేస్తాడా?

ఈ ఏడాది బాలీవుడ్ సినిమా కొట్టిన భారీ హిట్స్ తో మళ్ళీ వారు పుంజుకోగా ఎట్టకేలకు బాలీవుడ్ కం బ్యాక్ ఇచ్చినట్టు అయ్యింది. అయితే ఈ హిట్స్ లో కూడా మన సౌత్ ఇండియా దర్శకులు నటీనటుల ప్రెజెన్స్ కూడా ఉంది. మరి అలా మరో సంచలనం సృష్టించేందుకు వస్తున్నా మోస్ట్ అవైటెడ్ చిత్రమే “ఆనిమల్”.

బాలీవుడ్ స్టార్ నటుడు రణబీర్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన ఈ చిత్రం అప్పుడెప్పుడో సినిమా అనౌన్స్ చేసిన నాటి నుంచే భారీ హైప్ నెలకొల్పుకోగా ఇప్పుడు డిసెంబర్ 1 రిలీజ్ కి రాబోతుంది. అయితే గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమా నిడివి విషయంలో బాలీవుడ్ వర్గాలు షాకింగ్ వార్తలే ప్రచారం చేసాయి.

అయితే ఇప్పుడు దీనిపై అఫీషియల్ క్లారిటీ వచ్చేసింది. దీని ప్రకారం ఈ మధ్య కాలంలోనే కాదు కొన్నేళ్ల లోనే ఏ సినిమా కూడా రాని షాకింగ్ రన్ టైం తో ఆనిమల్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. మరి స్వయంగా దర్శకుడు సందీప్ వంగ రివీల్ చేసిన దానితో ఆనిమల్ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాల 23 సెకండ్స్ మరియు 16 ఫ్రేమ్స్ తో రాబోతుందట.

ఇది షాకింగ్ రన్ టైం అయితే సందీప్ గత చిత్రం కబీర్ సింగ్ కి వచ్చినట్టుగానే దీనికి కూడా ఏ సర్టిఫికెట్ వచ్చినట్టుగా అంటున్నారు. బాలీవుడ్ హిస్టరీ లోనే ఓ ఏ సర్టిఫికెట్ చిత్రం 300 కోట్ల గ్రాస్ అందుకున్నది లేదు దానిని అప్పుడు “కబీర్ సింగ్” అందుకుంది. ఇక ఇప్పుడు మళ్ళీ ఆనిమల్ కి అదే ఏ సర్టిఫికెట్ ని సెన్సార్ వారు అందించారు. ఇక ఆనిమల్ ఎలాంటి సంచలనం అందుకుంటుందో చూడాలి. 
https://x.com/imvangasandeep/status/1727301264915239246?s=20