Akash Puri: ఆకాష్ పూరి చోర్ బజార్ కోసం రంగంలోకి దిగిన రౌడీ స్టార్!

Akash Puri:డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ కుమారుడు ఆకాష్ పూరి బాల నటుడిగా పలు సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ క్రమంలోనే నటుడిగా ఆకాష్ పూరి మెహబూబా సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఇలా మొదటి సినిమాతోనే ఆకట్టుకున్న ఆకాష్ తాజాగా రొమాంటిక్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకులను సందడి చేశారు.రొమాంటిక్ సినిమా ద్వారా మాస్ యాక్షన్ సన్నివేశాలతో అదరగొట్టిన ఆకాశ్ తాజాగా చోర్ బజార్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

‘జార్జ్ రెడ్డి’ చిత్ర దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆకాశ్ పూరి సరసన గెహ్నా సిప్పీ నటిస్తోంది. ఇటీవలే ఈ సినిమా నుంచి ఒక పాట విడుదలైంది. హీరో రామ్ పోతినేని చేతుల మీదుగా విడుదలైన ఈ పాట సోషల్ మీడియాలో ఎంతో అద్భుతమైన రెస్పాన్స్ దక్కించుకుంది. ఇలా ఈ సినిమా కోసం కుర్ర హీరోలందరూ రంగంలోకి దిగుతూ సినిమా విజయం కోసం పాటు పడుతున్నారు.

తాజాగా ఆకాశ్ చోర్ బజార్ సినిమా కోసం రౌడీ హీరో విజయ్ దేవరకొండ కూడా రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే చోర్ బజార్ సినిమా నుంచి ఈనెల 12వ తేదీ మధ్యాహ్నం 12 గంటల 12 నిమిషాల కు మరొక పాటలను విడుదల చేయబోతున్నారు. అయితే ఈ పాటను రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతులమీదుగా విడుదల చేయబోతున్నారు.ఈ సినిమాలో ఆకాశ్ ఒక దొంగ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. కార్ల టైర్ల నుంచి ప్రతి ఒక్కటి దొంగతనం చేసి చోర్ బజార్ లో అమ్మేస్తూ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్ లో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.