Anupama Parameswaran: వాట్సాప్ నెంబర్ అడిగిన నెటిజన్… అదిరిపోయే సమాధానం చెప్పిన అనుపమ!

Anupama Parameswaran: టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్ గా ఎన్నో చిత్రాల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హిట్ ఫ్లాఫ్ లతో సంబంధంలేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్న అనుపమ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు.ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా గడుపుతున్నప్పటికీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటారు.కనీసం నెలకు ఒకటి రెండు సార్లు అయినా ఈమె తన అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబుతుంటారు.

ఈ విధంగా అభిమానులతో ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పడమే కాకుండా అభిమానుల కోసం పాటలు పాడుతూ వారిని సందడి చేస్తుంటారు. తాజాగా మరోసారి అభిమానులతో ముచ్చటించిన ఈ ముద్దుగుమ్మకు నెటిజన్ల నుంచి పలు ఆసక్తికరమైన ప్రశ్నలు ఎదురయ్యాయి ఈ క్రమంలోనే కొందరు తన ఫ్యామిలీ ఫొటోస్, తన లేటెస్ట్ ఫోటోస్ అలాగే తన తదుపరి చిత్రాల గురించి ఎన్నో రకాల ప్రశ్నలు అడుగుతూ వాటికి సమాధానాలు రాబట్టారు. మరికొంత మంది నెటిజన్లు అయితే ఏకంగా తన ఫోన్ నెంబర్ కూడా అడిగారు.

ఇదిలా ఉండగా ఒక నెటిజన్ ఏకంగా నటి అనుపమను తన వాట్సాప్ ఫోన్ నెంబర్ అడిగారు. ఇలా నెటిజన్ వాట్సాప్ నెంబర్ అడగడంతో అనుపమ దిమ్మతిరిగే సమాధానం చెబుతూ సదరు నెటిజన్ కి షాక్ ఇచ్చారు.ఈ విధంగా వాట్సాప్ నంబర్ అడిగిన నెటిజనులకు ఈమె సమాధానం చెబుతూ వాట్సాప్ నెంబర్ నాట్ ఫౌండ్ అంటూ సమాధానం చెప్పారు. ఇలా ఈమె సమాధానం విన్న నెటిజన్లు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. ఇక ఈమె సినిమాల విషయానికి వస్తే రౌడీ బాయ్స్ చిత్రంతో మంచి హిట్ తన ఖాతాలో వేసుకున్న అనుపమ కార్తికేయ 2, 18 పేజెస్, బటర్ ఫ్లై వంటి చిత్రాలతో బిజీగా ఉన్నారు.