ప్రభాస్ “సలార్ 1” కి భారీ నిడివి వచ్చిందా?

పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ప్రెజెంట్ బిగ్గెస్ట్ ప్రాజెక్ట్ “సలార్” ఫీవర్ ఐతే ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో నడుస్తుంది. భారీ లెవెల్లో ఈ చిత్రంపై అంచనాలు నెలకొనగా కేజీఎఫ్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ వాటికి మించి పదింతలు ఏక్షన్ ఎలిమెంట్స్ తో అయితే తెరకెక్కించాడు.

ఇక దీనిని కూడా రెండు భాగాలుగా ప్లాన్ చేస్తున్నట్టుగా కన్ఫర్మ్ చేసిన మేకర్స్ ఈ భారీ చిత్రానికి భారీ నిడివినే లాక్ చేసినట్టుగా ఇప్పుడు రూమర్స్ వినిపిస్తున్నాయి. కాగా ఈ చిత్రం పై లేటెస్ట్ వస్తున్నా రూమర్స్ ప్రకారం ఈ చిత్రం 3 గంటల 10 నిమిషాలకి పైగా ఫుటేజీ వచ్చినట్టుగా తెలుస్తుంది.

మరి ఇందులో అయితే కొంతమేర ట్రిమ్ చేసి ఓ 3 గంటల లోపు ఉండే చిత్రాన్ని అయితే మేకర్స్ రిలీజ్ చేస్తారని సమాచారం. మరి ఈరోజుల్లో రన్ టైం పెద్ద విషయం ఏమీ కాదు. బాగుంటే ఎన్నో చిత్రాలని పాన్ ఇండియా ఆడియెన్స్ ఆదరించారు. సో ఈ చిత్రం కూడా హిట్ అయితే ఆపేది మాత్రం ఎవరూ లేరని చెప్పొచ్చు.

ఇక ఈ చిత్రం అయితే ఈ సెప్టెంబర్ 28న ప్రపంచ వ్యాప్తంగా భారీ రిలీజ్ కి రాబోతుండగా యూఎస్ మార్కెట్ లో అయితే నెవర్ బిఫోర్ ఇండియన్ రిలీజ్ గా వస్తుంది అలాగే ఈ చిత్రం డెఫినెట్ గా 1000 కోట్ల వసూళ్లు నమోదు చేస్తుంది అని ట్రేడ్ పండితులు ఇప్పుడు నుంచే చెప్తున్నారు. ఇంకా శృతి హాసన్, పృథ్వీ రాజ్ సుకుమారన్ తదితరులు ఈ చిత్రంలో కీలక పాత్రల్లో అయితే నటించారు.