టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం లైగర్. టాలెంటెడ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో విజయ్ కి జోడిగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో విడుదల కాబోతోంది. ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ పలు ప్రాంతాలలో పర్యటిస్తూ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడు. అంతేకాకుండా ఎన్నో ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంటూ సినిమా విశేషాల గురించి ప్రేక్షకులతో ముచ్చటిస్తున్నాడు.
ఈ క్రమంలో సినిమా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ, అనన్య పాండే సోషల్ మీడియా వేదికగా అభిమానులతో ముచ్చటించారు. నెటిజన్స్ అడిగిన ప్రశ్నలకు విజయ్ చాలా ఓపికగా సమాధానాలు చెప్పాడు. ఈ క్రమంలో అనన్య గురించి ప్రస్తావిస్తూ ఆమెలో మీకు నచ్చని విషయం ఏమిటి అని అడగ్గా.. విజయ్ స్పందిస్తూ అనన్య ఎప్పుడూ ఏదో ఒకదాని గురించి ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది. ఆమెలో నాకు నచ్చని విషయం ఇదే. ఒకవేళ అనన్య లాంటి అల్లరి పిల్ల నాకు పుడితే ఎలా భరించాలో భయమేస్తోంది. అనన్య చిన్నతనంలో ఎలా ప్రవర్తించేదో నాకు తెలియదు. కానీ… చిన్నతనం నుండి తనని భరిస్తున్నందుకు వారి తల్లిదండ్రులకు నా సానుభూతి అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలో అనన్య ఎప్పుడు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఆసక్తి చూపిస్తుందని ఆమెలో నాకు బాగా నచ్చే గుణం ఇదే అంటూ వెల్లడించాడు.
అంతేకాకుండా మీ జీవితంలో నిజమైన ఫైటర్ ఎవరు అని ఒక నెటిజన్ ప్రశ్నించగా.. సంతోషం, ప్రేమ, గౌరవం, డబ్బు ఇలా సొసైటీలో మనకంటూ ఒక గుర్తింపు ఏర్పరచుకోవటానికి నిత్యం కష్టపడే వాడే నిజమైన ఫైటర్ అని సమాధానం చెప్పాడు. ఇదిలా ఉండగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా లెవెల్ లో అన్ని భాషలలో విడుదల కానున్న ఈ సినిమా ఆగస్టు 24వ తేదీ ముంబైలో ప్రీమియర్ షో వేయనున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో తెరకే కట్టడంతో బాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ కూడా ఈ సినిమాకు సహనిర్మాతగా పనిచేశారు. ఈ సినిమా నుండి విడుదలైన ట్రైలర్ టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని సినిమా మీద అంచనాలను అమాంతం చేశాయి. ఆగస్టు 25వ తేదీన విడుదల కానున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంటుందో చూడాలి మరి.