ఇప్పుడు టాలీవుడ్ సినిమా దగ్గర మోస్ట్ హ్యాపెనింగ్ సూపర్ హిట్ హీరోయిన్ ఎవరైనా ఉంది అంటే అది డెఫినెట్ గా యంగ్ సెన్సేషన్ శ్రీలీల అనే చెప్పాలి. కాగా ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ బిజీ హీరోయిన్ గా మారిపోయిన ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు చేతిలో అనేక చిత్రాలు పెట్టుకొని ఒకో సినిమా కంప్లీట్ చేస్తుంది.
ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబుతో చేస్తున్న భారీ చిత్రం “గుంటూరు కారం” కూడా ఒకటి కాగా అయితే ఈ చిత్రం విషయంలోనే ఇంట్రెస్టింగ్ టాక్ ఒకటి వినిపిస్తుంది. ఇది వరకు హీరోస్ కి డూప్ అని మనం చాలా ఎక్కువగా విని ఉంటాం కానీ ఇప్పుడు హీరోయిన్ కి డూప్ అని శ్రీలీల విషయంలో వినిపిస్తుంది.
ఇప్పుడు జరుగుతున్న కొత్త షెడ్యూల్ షూట్ లో మహేష్ బాబుతో సహా శ్రీలీలకి డూప్ పై పలు సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు అట. దీనితో ఈ చిత్రం విషయంలో ఈ టాక్ ఇంట్రెస్టింగ్ గా మారింది. కాగా బహుశా శ్రీలీల కి డూప్ అనే అంశం కూడా ఇదే మొదటి సారి వినిపించినట్టు ఉంది.
ఇక ఈ భారీ చిత్రంలో మరో హీరోయిన్ మీనాక్షి చౌదరి కూడా నటిస్తుండగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని హారిక హాసిని ఎంటర్టైన్మెంట్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మాణం వహిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది.