ఆర్టీసీ క్రాస్ రోడ్స్?లోని సంధ్య థియేటర్? యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. సంధ్య థియేటర్‌లో పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా విషాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. సినిమా చూసేందుకు వచ్చిన అభిమానుల మధ్య జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ మృతిచెందారు. బుధవారం రాత్రి పుష్ప 2 బెనిఫిట్ షోను చూసేందుకు హీరో అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని సంధ్య థియేటర్‌కు రాగా.. అతడిని చూసేందుకు అభిమానులు ఎగబడ్డారు. దీంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది.
ఈ క్రమంలో వారిని నిలువరించేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో దిల్‌సుఖ్‌నగర్‌కు చెందిన రేవతి (39) అనే మహిళతో పాటు ఆమె కుమారుడు శ్రీతేజ్ (9) కింద పడిపోయి జనాల కాళ్ల మధ్య నలిగిపోయారు. వారిద్దరూ తీవ్ర గాయాలతో సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే తల్లీకుమారులను పోలీసులు పక్కకు తీసుకెళ్లి సీపీఆర్ చేశారు.
ఆ తర్వాత ఓ ప్రైవేట్ దవాఖాన తరలించగా.. చికిత్స పొందుతూ రేవతి మృతి చెందారు. శ్రీతేజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో నిమ్స్ హాస్పిటల్‌కు తరలించగా.. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. అయితే ఈ ఘటనకు సంబంధించి సంధ్య థియేటర్ యాజమాన్యంపై కేసు నమోదు అయ్యింది. థియేటర్ యాజమాన్యం సెక్యూరిటీ సరిగ్గా ఏర్పాటు చేయకపోవడంతోనే తొక్కిసలాట జరిగి ఓ మహిళ మృతి చెంధారని పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు సంధ్య థియేటర్ యాజమాన్యంపై ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు.