Prabhas : సలార్ నుండి బిగ్ అప్ డేట్…. ప్రీ క్లైమాక్స్ సీన్ అదిరిపోతుందట…!

Prabhas : కేజీఎఫ్ సినిమాల తరువాత ప్రశాంత్ చేస్తున్న నాలుగో సినిమా సలార్. ఉగ్రమ్ సినిమాతో కన్నడ సినీ ఇండస్ట్రీ తనవైపు చూసేలా చేసాడు. ఇక కేజీఎఫ్ 1 తో ఇండియా మొత్తం తనవైపు చూసేలా చేసిన ప్రశాంత్ నీల్ ఇక కేజీఎఫ్ 2 సినిమాతో ఇండియా టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా నిలిచారు. తన సినిమాల్లో హీరోలను చాలా పవర్ ఫుల్ గా చూపించే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సినిమా తీయాలనీ ఇపుడు యంగ్ హీరోస్ అందరు కోరుకుంటున్నారు. ఇక కేజీఎఫ్ 2 తర్వాత ప్రశాంత్ తీస్తున్న నెక్స్ట్ సినిమా ప్రభాస్ తో తీస్తున్న సలార్ సినిమా.

ప్రభాస్ కు బాహుబలి తర్వాత సరైన హిట్ లేదు. సాహో భారీ అంచనాల నడుమ విడుదలయి అభిమానుల అంచనాలు అందుకోలేక పోయింది. ఇక ఆ తరువాత వచ్చిన రాధే శ్యామ్ మరింత నిరాశపరిచింది. సాహో సినిమా అయిన కనీసం ఓపెనింగ్స్ రాబట్టింది కానీ రాధే శ్యామ్ మొదటి రోజు నుండే ప్లాప్ టాక్ తో భారీ నష్టాలను మిగిల్చింది. ఇక ఇపుడు ప్రభాస్ అభిమానుల ఆశలన్నీ సలార్ సినిమాపైనే. ఇక ఈ సినిమా గురించి ఏ చిన్న అప్ డేట్ ను అభిమానులు వదలడం లేదు.

ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు అదుర్స్…

సలార్ ప్రీ క్లైమాక్స్ లో వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ను లోయలో షూట్ చేశారని 20 కోట్ల రూపాయలు ఖర్చు చేసి తెరకెక్కించిన ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్రేక్షకుల అంచనాలను మించి ఉంటుందని సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ యాక్షన్ సీన్ కు సంబంధించిన షూట్ పూర్తైందని సమాచారం . భయంకరమైన లోయలో ఛేజింగ్ సన్నివేశాలతో ఈ యాక్షన్ సీన్స్ ను తెరకెక్కించారని తెలుస్తోంది. సలార్ మూవీ హాలీవుడ్ స్థాయిలో ఉండబోతుందట. సలార్ సినిమా మే 1తేదీ నుండి రెగ్యులర్ షూటింగ్ మొదలువ్వబోతోంది. ప్రీ క్లైమాక్స్ యాక్షన్ సీన్ గురించిన క్రేజీ అప్ డేట్ ఇపుడు అభిమానులను ఊరిస్తోంది. సలార్ సినిమా పై మరింత అంచనాలను పెంచుతోంది.