మెగా ఫ్యాన్స్ పెద్ద డిసప్పాయింట్‌మెంట్.. ఇలాంటి నిర్ణయం ఏంటీ ..?

మెగా ఫామిలీ నుంచి ఒక కొత్త హీరో వస్తున్నాడంటే మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులందరు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారన్న సంగతి తెలిసిందే. అలాగే ఇప్పటికే స్టార్ డం సంపాదించుకున్న మెగా మేనల్లుడు యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న సినిమా ‘ఉప్పెన’. ఈ సినిమాకి క్రియోటివ్ డైరెక్టర్ సుకుమార్ కథ అందించడం విశేషం. ఇక సుకుమార్ అసోసియేట్ బుచ్చిబాబు దర్శకత్వం వహిస్తున్నారు.

Uppena editing done and ready for censor? - tollywood

తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించడంతో ఈ సినిమాకి తమిళ్‌లో కూడా మంచి హైప్ వచ్చింది. ఇక ‘నీ కన్ను నీలి సముద్రం’ అనే పాట ఇప్పటికే ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా హీరోయిన్ గా క్రితి శెట్టి టాలీవుడ్ కి పరిచయమవుతుంది. అయితే లాక్ డౌన్ తో థియోటర్స్ మూతపడటం తో రిలీజ్ కాకుండా ఈ మెగా మేనల్లుడి సినిమా ఆగిపోయింది. అయినా డెబ్యూ సినిమా కావడంతో థియోటర్స్ లోనే రిలీజ్ చేయాలని భావించారు.

కాని ఇప్పుడు మెగా ఫ్యాన్స్ కి ఒక షాకింగ్ న్యూస్ అని తెలుస్తుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ లో ఈ సినిమా రిలీజ్ అవుతుందని.. భారీ మొత్తం ఆఫర్ చేయడంతో మేకర్స్ ఓటీటీలో రిలీజ్ చేసే విధంగా ఆలోచిస్తున్నట్టు సమాచారం. మరి ఇందులో ఎంతవరకు నిజముందో చూడాలి. ఇక ఈ సినిమాకి రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతమందించాడు.

కాగా వైష్ణవ్ తేజ్ ప్రసుతం తన రెండవ సినిమాని ప్రముఖ దర్శకుడు క్రిష్ తో చేస్తున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా వికారాబాద్ లో శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుండగా 45 రోజుల సింగిల్ షెడ్యూల్ లో ఈ సినిమా టాకీపార్ట్ కంప్లీట్ చేయనున్నారు.