30 weds 21:30 వెడ్స్ 21 ఫేమ్ చైతన్య… ఇక వెండితెరపై కనిపిస్తాడా?

30 weds 21:30 వెడ్స్ 21 అనే ఒక విభిన్నమైన వెబ్ సిరీస్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.30 ఏళ్ళు వచ్చిన ఒక వ్యక్తి తన కంటే తొమ్మిదేళ్ల చిన్న అమ్మాయి ని పెళ్లి చేసుకోవడం ఇక ఈ వెబ్ సిరీస్ లో ఎంతో అమాయకంగా  తన నటనను ప్రదర్శించి,ప్రేక్షకులను ఎంతో అలరించాడు చైతన్య రావు.ఇక ఇప్పుడు వెండితెరపై హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.

ఇటీవలి కాలంలో సోషల్ మీడియా ద్వారా పాపులారిటీ సంపాదించుకున్న తర్వాత,వారు వెండి తెరపై కూడా కనిపించడం జరుగుతోంది. వెండితెర పై ఇలాంటి నటులు చాలా మందే ఉన్నారు. ప్రస్తుతం ఈ బాటలోనే చైతన్య రావు కూడా వెండి తెరపై కనిపించనున్నారు. వెండితెరపై తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకుని మంచి క్రేజ్ ఉన్న హీరో గా ఎదిగిన నవీన్ పోలిశెట్టి కూడా ఈ బాటలో వచ్చిన వాడే.

పెళ్లిచూపులు డియర్ కామ్రేడ్ దొరసాని ఏబిసిడి లాంటి సూపర్ హిట్ చిత్రాలకు నిర్మాణ భాగస్వామిగా ఉన్న బిగ్ బెన్ సినిమాస్ ఇక ఇప్పుడు కొత్త తరహా చిత్రంతో కొత్త దర్శకులకు అవకాశం ఇస్తోంది. ఇప్పుడు బిగ్ బెన్ సినిమా సోలో ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది.చందు ముద్దు దర్శకుడిగా, చైతన్య హీరోగా ఒక సినిమా నిర్మిస్తున్నారు. త్రిల్లర్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా ఉంటుందట.విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా నిర్మించాలని సన్నాహాలు చేస్తున్నారు. సినిమాకి సంబంధించిన నటీనటులు, ఇతర విషయాల గురించి చిత్ర బృందం త్వరలోనే వెల్లడిస్తాను అని ప్రకటించింది. ఏదేమైనా మొత్తానికి చైతన్య హీరోగా వెండి తెరపై కనిపించనున్నారు