రెమ్యునరేషన్స్ ఏకంగా 250 కోట్లు

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ప్రాజెక్ట్ K. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. పాన్ వరల్డ్ మూవీగా దీనిని తీసుకొచ్చే ప్రయత్నంలో నాగ్ అశ్విన్ ఉన్నారు. ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథ మూడో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో ఉంటుందంట. మైథాలజీలోని క్యారెక్టర్ ని ఫ్యూచర్ లో నాగ్ అశ్విన్ చూపిస్తున్నారంట.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ మాత్రమే కాకుండా చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఉన్నారు. ఈ మెయిన్ లీడ్ చేస్తోన్న అందరి రెమ్యునరేషన్ కలుపుకొనే సినిమాకి 250 కోట్ల వరకు బడ్జెట్ అవుతోందని టాక్. ప్రభాస్ ఈ సినిమాకోసం కెరియర్ లోనే హైయెస్ట్ రెమ్యునరేషన్ గా 150 కోట్లు తీసుకుంటున్నాడంట. ఇక కమల్ హాసన్ చిత్రంలో ప్రతినాయకుడిగా నటించారు. ఆయన పాత్ర నిడివి తక్కువగానే ఉన్న ఇంపాక్ట్ మాత్రం ఎక్కువ ఉంటుందంట.

ఈ నేపథ్యంలో కమల్ హాసన్ కి 20 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారంట. ఇక అమితాబచ్చన్ కి 15 కోట్ల వరకు ఇస్తున్నట్లు తెలుస్తోంది. దీపికా పడుకునే 10 కోట్లు ఛార్జ్ చేస్తోందంట. అలాగే దిశా పటాని 5 కోట్లు రెమ్యునరేషన్ గా తీసుకుంటుంది. వీరితో పాటు మిగిలిన క్యాస్ట్ అండ్ క్రూ అందరితో కలుపుకుంటే 250 కోట్లు రెమ్యునరేషన్స్ గానే ఖర్చవు అవుతున్నాయి.

ఇక సినిమా మరో 300-350 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారంట. ఓవరాల్ గా బడ్జెట్ 600 కోట్ల వరకు పెడుతున్నారని తెలుస్తోంది. ఇండియాలోనే హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న ప్రాజెక్ట్ ఈ సినిమా అయ్యే అవకాశాలు ఉన్నాయి. రాజమౌళి నెక్స్ట్ మహేష్ బాబుతో చేస్తోన్న సినిమా కోసం 500 కోట్ల వరకు మాత్రమే బడ్జెట్ అనుకుంటున్నారంట.

పాన్ వరల్డ్ మూవీగానే దానిని తెరకెక్కించనున్నారు. అలాగే హాలీవుడ్ యాక్టర్స్ ని రంగంలోకి దించుతున్నారు. అయినా కానీ బడ్జెట్ 500 కోట్లు దాటకుండా ప్లాన్ చేస్తున్నారంట. ఇక ప్రాజెక్ట్ K లో స్టార్ క్యాస్టింగ్ ఉండటం కచ్చితంగా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో హైయెస్ట్ బిజినెస్ చేసే చిత్రం ఇదే అయ్యే ఛాన్స్ ఉందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు.