Manchu Manoj: కన్నప్ప సినిమాకు మనోజ్ రివ్యూ.. విష్ణు షాకింగ్ కామెంట్స్… జీర్ణించుకోలేకపోతున్నారంటూ?

Manchu Manoj: మంచు మనోజ్ మంచు విష్ణు ఇద్దరు అన్నదమ్ముల మధ్య గత కొంతకాలంగా పెద్ద ఎత్తున విభేదాలు చోటు చేసుకున్న విషయం మనకు తెలిసిందే. వీరి కుటుంబ గొడవల గురించి రోడ్లపైకి వచ్చి కొట్టుకోవడమే కాకుండా పోలీస్ స్టేషన్లకు వెళుతూ ఒకరిపై మరొకరు కేసులు కూడా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే మోహన్ బాబు మంచు విష్ణు మనోజ్ ను పూర్తిగా వారి కుటుంబానికి దూరం పెట్టిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మంచు విష్ణు నటించిన కన్నప్ప సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా విడుదలైన మొదటి రోజు నుంచి మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

ఇకపోతే ఈ సినిమా విషయంలో తన అన్నయ్యతో ఎన్ని గొడవలు ఉన్నా మనోజ్ మాత్రం సినిమాకు పూర్తిస్థాయిలో మద్దతు తెలుపుతూ వచ్చారు. సినిమా విడుదలకు ముందు రోజు అందరికీ విషెస్ చెబుతూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అలాగే సినిమా విడుదలైన మొదటి రోజే ఈయన కన్నప్ప సినిమాని థియేటర్లో చూసారు. ఇక సినిమా చూసిన అనంతరం మనోజ్ సినిమా గురించి కూడా తన అభిప్రాయాన్ని తెలియజేశారు.

సినిమా చాలా అద్భుతంగా ఉందని ప్రభాస్ వచ్చిన తర్వాత సినిమా మరో లెవెల్ ఉంటుందని తెలిపారు. ఇక మీ అన్నయ్య మంచు విష్ణు గారి నటన ఎలా ఉందనే ప్రశ్న రావడంతో ఊహించిన దానికంటే వెయ్యిరెట్లు బాగుందని ఇలా చేస్తారని కలలో కూడా ఊహించలేదు అంటూ సినిమా గురించి మంచి రివ్యూ ఇచ్చారు. ఇలా మంచు మనోజ్ రివ్యూ గురించి థాంక్స్ మీట్ కార్యక్రమంలో భాగంగా విష్ణుకి ప్రశ్న ఎదురు కావడంతో ఈయన నా సినిమాకి ఎవరైతే మంచి రివ్యూ ఇచ్చారో వారందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు అంటూ కృతజ్ఞతలు తెలిపారు. అదేవిధంగా మా సినిమా ఇంత మంచి హిట్ అవుతుందని ఎవరు ఊహించి ఉండరు ఈ సక్సెస్ కొంతమందికి మింగుడు పడదని సోమవారం వరకు కూడా ఈ విషయం జీర్ణం కాదు అంటూ విష్ణువు చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి.