మలయాళంలో ఎక్కువగా కంటెంట్ బేస్డ్ కథలు వస్తూ ఉంటాయి. అలాగే అక్కడి ప్రేక్షకులు కూడా ఓవర్ హైప్ హీరోయిజం కాకుండా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లని ఇష్టపడుతూ ఉంటారు. దానికి తగ్గట్లుగానే అక్కడ సినిమాలు వస్తూ ఉంటారు. స్టార్ హీరోలైన మోహన్ లాల్, మమ్ముట్టి లాంటి వారు కూడా ఎక్కువగా థ్రిల్లింగ్ కాన్సెప్ట్ లతోనే మూవీస్ చేస్తూ ఉంటారు.
ప్రస్తుతం మలయాళంలో టోవినో థామస్ యంగ్ జెనరేషన్ లో స్టార్ హీరో రేంజ్ ఇమేజ్ తో వరుస సక్సెస్ లు అందుకుంటూ దూసుకుపోతున్నాడు. అతను హీరోగా తాజాగా 2018 అనే మూవీ వచ్చింది. కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో ఈ మూవీ కథాంశం ఉంటుంది. ఇక తాజాగా రిలీజ్ అయిన ఈ మూవీకి రికార్డు స్థాయిలో కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.
మలయాళంలో హైయెస్ట్ గ్రాస్ సాధించిన మోహన్ లాల్ పులి మురుగన్ మూవీ రికార్డుని 17 రోజుల్లో ఈ చిత్రం బ్రేక్ చేసిందంటే ఏ స్థాయిలో ఆదరణ వస్తుందో అంచనా వేయవచ్చు. పులి మురుగన్ 25 కోట్లతో నిర్మించగా 137 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసింది. మలయాళంలో ఇప్పటి వరకు ఇదే హైయెస్ట్. ఇప్పుడు టోవినో థామస్ 2018 సినిమా 137 కోట్ల గ్రాస్ ని బీట్ చేయడం విశేషం.
కేవలం 1.75 కోట్ల ఫస్ట్ డే గ్రాస్ కలెక్షన్స్ తో స్టార్ట్ అయిన ఈ మూవీ రోజు రోజుకి విశేషమైన ప్రేక్షకాదరణని సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. మలయాళంలో బ్లాక్ బస్టర్ కావడంతో ఇప్పుడు ఈ సినిమాని పాన్ ఇండియా భాషలలో మే 26న రిలీజ్ చేయడానికి రెడీ అయ్యారు. స్టార్ హీరో మోహన్ లాల్ కలెక్షన్స్ రికార్డ్ ని కుర్ర హీరో టోవినో థామస్ ఇప్పుడు బ్రేక్ చేసి సరికొత్త హిస్టరీ క్రియేట్ చేసే దిశగా వెళ్తున్నాడు.
ఇదిలా ఉంటే ప్రస్తుతం టోవినో థామస్ హీరోగా ఏఎంజీ అనే మూవీ పాన్ ఇండియా రేంజ్ లో భారీ బడ్జెట్ తో నిర్మితం అవుతోంది. ఈ మూవీ పీరియాడిక్ జోనర్ లో 17వ శతాబ్దం నాటి ఓ గజదొంగ కథగా ఈ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో కీర్తి శెట్టి హీరోయిన్ గా మలయాళంలోకి అడుగుపెడుతూ ఉండటం విశేషం.