బాక్సాఫీస్ : తెలుగులో రెండో రోజు భారీ గ్రాఫ్ తో “2018” వసూళ్లు.!

లేటెస్ట్ గా టాలీవుడ్ సినిమా దగ్గర అయితే అదిరే విజయాలు నమోదు చేస్తున్న చిత్రాల్లో దాదాపు ఇతర భాషల నుంచే సినిమాలు కనిపిస్తుండగా ఈ చిత్రాల్లో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన లేటెస్ట్ సినిమా “2018” కూడా ఒకటి. మరి ఒరిజినల్ గా మళయాళ భాషకి చెందిన ఈ చిత్రంలో “మిన్నల్ మురళి” హీరో టోవినో థామస్ హీరోగా నటించగా జూడే ఆంథోని జోసెఫ్ దర్శకత్వం వహించారు.

మరి కేరళలో 2018 లో జరిగిన అతి పెద్ద డిజాస్టర్ వరదల నేపథ్యంలో తెరకెక్కించిన ఈ సినిమా మళయాలంలో అయితే రికార్డు వసూళ్లతో దుమ్ము లేపగా ఈ సినిమా విజయం నెమ్మదిగా తెలుగులో కూడా హాట్ టాపిక్ అయ్యింది. దీనితో ఈ చిత్రం తెలుగులో కూడా డబ్ చేసి రిలీజ్ చేయగా దీనికి ఇప్పుడు సాలిడ్ వసూళ్లు రిజిస్టర్ అవుతున్నట్టుగా ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి.

మరి ఈ సినిమా రిలీజ్ రోజు అయితే 1.1 కోటి గ్రాస్ ని తెలుగు రాష్ట్రాల్లో నమోదు చేయగా ఇప్పుడు రెండో రోజు భారీ గ్రాఫ్ తో 1.73 కోట్ల గ్రాస్ కి ఎగబాకింది. దీనితో ఈ చిత్రం రెండు రోజుల్లో 2.8 కోట్ల గ్రాస్ ని అయితే ఇప్పుడు టచ్ చేసినట్టుగా తెలుస్తుంది.

దీనితో ఈ చిత్రం తెలుగులో కూడా సెన్సేషనల్ విజయాన్ని అయితే నమోదు చేసేలా కనిపిస్తుంది అని చెప్పాలి. అలాగే మన తెలుగు వసూళ్లతో ఈ చిత్రం ఇప్పుడు వరల్డ్ వైడ్ ఈజీగా 200 కోట్ల గ్రాస్ కి చేరువ అవుతూ మలయాళ ఇండస్ట్రీ నుంచి బహుశా మొదటి 200 కోట్ల గ్రాసింగ్ సినిమాగా అయితే రికార్డు సెట్ చేస్తుంది అని చెప్పవచ్చు.