మొదటి రోజు కంటే 70% అత్యధిక కలక్షన్స్ తో ప్రభంజనం సృష్టిస్తున్న ‘2018’ సినిమా

కేరళలో రీసెంట్ టైమ్స్ లో ఇండస్ట్రీ హిట్‌గా నిలబడిన చిత్రం 2018. అతి తక్కువ రోజుల్లో 100 కోట్లు షేర్ రాబట్టింది ఈ చిత్రం. ఈ చిత్రం మే 26న తెలుగులో విడుదల అయింది. ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ ఈ మాస్టర్‌పీస్‌ని తెలుగు ప్రేక్షకులకు అందించారు.ప్రస్తుతం ఈ సినిమాకి అనూహ్య స్పందన లభిస్తుంది. ప్రతి ఒక్కరూ ఈ సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

కేవలం ప్రశంసలకు మాత్రమే కాకుండా కలక్షన్స్ వర్షం కూడా కురిపిస్తుంది ఈ సినిమా. తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా మొదటిరోజు 1 కోట్లు వసూలు చేసింది. ఇదే ఆశ్చర్యం అనుకుంటే, అంతకు మించిన ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కేవలం మౌత్ టాక్ ఈ సినిమా రెండవ రోజు 1.7 గ్రాస్ ను సాధించింది. మొదటి రోజు కంటే రెండవరోజు కలక్షన్స్ పెరగడం అతి తక్కువ సినిమాలకు జరుగుతుంది. 2018 సినిమాకి అమాంతం 70 కలక్షన్స్ పెరగడం శుభసూచకం. తెలుగు ప్రేక్షకులు ఒక గొప్ప సినిమాను ఆదరిస్తారు అని నమ్మిన ప్రముఖ నిర్మాత బన్నీవాసు నమ్మకం మరోసారి రుజువైంది.

ఈ రెండు రోజులు గాను ఈ సినిమా మొత్తం కలక్షన్స్ 2.7 కోట్ల గ్రాస్ పైగా ఉంది.

2018 కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించబడింది. ఈ చిత్రంలో టోవినో థామస్, ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్, మరియు జాయ్ మాథ్యూ, సుధీష్ ముఖ్య పాత్రలు పోషించారు.