“2018” హీరోకి అరుదైన గౌరవం..! 

ఈ ఏడాది సౌత్ ఇండియా సినిమా దగ్గర వచ్చిన ఎన్నో భారీ హిట్ చిత్రాల్లో సౌత్ ఇండియా సినిమాని షేక్ చేసిన మలయాళ హిట్ చిత్ర “2018 ఎవ్రీ వన్ ఈజ్ హీరో” అనే చిత్రం కూడా ఒకటి. మలయాళంలో అయితే సరికొత్త ఇండస్ట్రీ హిట్ గా అక్కడ నుంచి భారీ మొత్తంలో 200 కోట్లకి పైగా వసూళ్లు రాబట్టి భారీ హిట్ గా నిలిచి అదరగొట్టగా యంగ్ హీరో తోవినో థామస్ పెర్ఫామెన్స్ కి స్పెషల్ అప్లాజ్ కూడా దక్కింది.

కాగా చాలా తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కించిన ఈ చిత్రం మలయాళం సహా తెలుగులో కూడా అద్భుత ఆదరణ అందుకుంది. కాగా ఇప్పుడు ఈ సినిమా హీరోకి అరుదైన గౌరవం దక్కింది. కాగా ప్రముఖ ఇంటర్నేషనల్ అవార్డ్స్ లో ఒకటైన సెప్టిమస్ అవార్డ్స్ లో మొత్తం ఆసియ నుంచి బెస్ట్ యాక్టర్ కేటగిరీలో అయితే ఇపుడు ఈ సినిమా హీరో తోవినో థామస్ కి చోటు దక్కడం విశేషంగా మారింది.

మరి ఈ నామినేషన్ తో అయితే ఇండియన్ సినిమా సినీ ట్రాకర్స్ కూడా ఆనందం వ్యక్తం చేస్తూ అందుకు థామస్ ఎంతో అర్హుడు అని అంటున్నారు. మరి 2018 లో కేరళలో వచ్చిన పెను ప్రమాదం భారీ వరదలు ఆధారంగా  అయితే జూడే అంథోని జోసఫ్ దర్శకత్వం వహించగా అపర్ణ బాలమురళి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ నామినేషన్ లో అయితే హీరో తోవినో థామస్ కి ఈ అవార్డు రావాలని అంతా కోరుకుంటున్నారు.